కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ వేగవంతం
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:23 PM
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదం జరిగిన ప్రదేశం వద్ద సహాయక చర్యలు, కన్వేయర్ బెల్టు పునరుద్ధ్దరణ పనుల ను వేగవంతం చేశామని టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి తెలిపారు.

- ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్
నాగర్‌కర్నూల్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదం జరిగిన ప్రదేశం వద్ద సహాయక చర్యలు, కన్వేయర్ బెల్టు పునరుద్ధ్దరణ పనుల ను వేగవంతం చేశామని టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. సోమవారం ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్ద సహాయక చర్యల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తోందని, ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీ ఆర్‌ఎఫ్, హైడ్రా, సింగరేణి, మైన్స్, రెస్క్యూ, దక్షిణ మధ్య రైల్వే బృందాలు ప్రతి కూల పరిస్థితుల్లోనూ 24 గంటల పాటు శ్రమిస్తున్నాయని అన్నారు. మైనింగ్ ప్రమాదాల్లో నిష్ణాతులైన వారి సేవలను వినియోగించుకుంటూ, వారి సలహా లు, సూచనలు తీసుకుంటూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నామని తెలి పారు. ప్రస్తుతం టన్నెల్‌లో కన్వేయర్ బెల్టును 13,630 మీటర్ల నుంచి 13,730 మీటర్ల వరకు పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నాగర్‌కర్నూల్ అద నపు కలెక్టర్ దేవసహాయం, ఆర్మీ అధికారులు వికాస్‌సింగ్, విజయ్‌కుమార్, ఎస్ డీఆర్‌ఎఫ్ అధికారి గిరిధర్‌రెడ్డి, హైడ్రా అధికారి సుదర్శన్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే అధికారి నేతిచంద్ర, జేపీ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.