మత్తు చిత్తు
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:40 PM
ఉమ్మడి మహబూ బ్‌నగర్ జిల్లాలో గంజాయి విక్ర యాలు అడ్డగోలుగా కొనసాగుతు న్నాయి.

- ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు
- మత్తుకు బానిసలవుతున్న యువకులు
- నామమాత్రంగానే నమోదవుతున్న కేసులు
- ఊర్కొండ పేట ఘటన గంజాయి బ్యాచ్ పనేనంటూ ఆరోపణలు
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి):ఉమ్మడి మహబూ బ్‌నగర్ జిల్లాలో గంజాయి విక్ర యాలు అడ్డగోలుగా కొనసాగుతు న్నాయి. టీనేజీ పిల్లలు గంజాయి కి బానిసలుగా మారి ఎలాంటి అరాచకాలు చేయడానికైనా సిద్ధ పడుతుండటంతో వారి తల్లిదం డ్రుల్లో ఆందోళన నెలకొన్నది. మరోవైపు ఊర్కొండపేట లాంటి సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకోవడంతో మహిళలు స్వేచ్ఛగా తిరగలేక పోతున్నారు. దైవదర్శనానికి వచ్చిన వివాహితపై ఏడుగురు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెనుక గంజాయి బ్యాచ్ ఉన్నదని ఆరోప ణలు రావడంతో ఆందోళన మరింత తీవ్రమైంది. గంజాయిని సరఫరా చేసే ముఠాపై ఉక్కుపాదం మోపకుంటే రానురాను పరి స్థితి మరింత దిగజా రుతుందనే ఆందోళన అన్ని వర్గాల్లో వ్యక్తమవు తోంది.
ప్రతీ ఏటా పెరుగుతున్న కేసులు
గంజాయి సరఫరాకు సంబంధించి ప్రతీ ఏటా కేసుల సంఖ్య పెరుగుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 2024 జనవరి 1 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 1 వరకు పది గంజాయి కేసులు నమోదయ్యాయి. మొత్తం 1276 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నా రు. ఒక్క నాగర్‌కర్నూల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనే ఆరు కేసులు నమోదు కాగా బిజినేపల్లిలో రెండు, అమ్రాబాద్, ఊర్కొండ మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 20 మందిని అరె స్టు చేశారు. నారాయణపేట జిల్లాలో గతేడాది మూ డు కేసులు నమోదు కాగా మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రెండు కేసుల్లో 500 గ్రాముల గంజాయి ని స్వాధీనం చేసుకొని ముగ్గురిని అదుపులోకి తీసు కున్నారు. మద్దూరు ఠాణాలో ఒక కేసు నమోదైంది. ఇక్కడ 1.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోగా 89 గంజాయి మొక్కలు కూడా లభ్యమయ్యాయి. వనపర్తి జిల్లాలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. 2023లో మూడు కేసులు నమోదు కాగా 4.399 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఏడుగురిని అరెస్టు చేశారు. గతేడాది రెం డు కేసులు నమోదు కాగా 207 గ్రాముల గంజా యి పట్టుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. జోగుళాం బ గద్వాల జిల్లాలో కూడా గంజాయి స్మగ్లింగ్, వాటి మొక్కల సాగు జోరుగా ఉన్నట్లు ఎక్సైజ్ అధికారుల నివేదిక ద్వారా తెలుస్తోంది. 2024లో ఉండవల్లి సమీపంలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు 18 గ్రాముల గంజాయిని ఒక టీ హోటల్ దగ్గర విక్రయిస్తుండగా పట్టుకున్న పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు.
నల్లమల నుంచి జోరుగా సరఫరా
నల్లమల అటవీ ప్రాంతం నుంచి హైదరాబాద్, ముంబయి, చెన్నైతో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్, రాయలసీమలోని కర్నూల్ జిల్లా లకు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తోంది. లోతట్టు అటవీ ప్రాం తం పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కూడా అతి కష్టం మీద చేరుకునే ప్రదేశాల్లో స్మగ్లర్లు కొందరి ద్వారా గంజాయిని పండిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అక్కడే గంజాయిని ఎండబెట్టి పర్యాట కుల రూపంలో కృష్ణానది ద్వారా పుట్టిపై ప్రయా ణించి పెబ్బేరు మీదుగా హైవేకు చేరుకొని అక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసు లు నిర్ధారణకు వచ్చారు. నల్లమల ఎగువ ప్రాంతం నుంచి భక్తుల రూపం లో దోమలపెంట, మన్ననూర్ ప్రాంతాలకు చేరుకొ ని అక్కడి నుంచి బస్సుల్లో ప్రయాణించి హైదరా బాద్‌లో తాము ఏర్పరచుకున్న అడ్డాలకు చేరుస్తూ కాలేజీ విద్యార్థు లే టార్గెట్‌గా గంజాయి సరఫరా చేస్తున్నారు. ఈ అంశం అనేక కేసుల్లో పట్టుబడిన నిందితుల నుంచి పోలీసులకు స్పష్టమైన సమా చారం ఉన్నది.