Share News

కన్వేయర్‌ బెల్ట్‌ సిద్ధం

ABN , Publish Date - Apr 02 , 2025 | 11:42 PM

శ్రీశైలం ఎడమ గట్టు (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో బురద మట్టి శిథిలాలను తొలగించేందుకు కన్వేయర్‌ బెల్ట్‌ పాత్ర కీలకం.

కన్వేయర్‌ బెల్ట్‌ సిద్ధం
సొరంగంలో సిద్ధం అయిన కన్వేయర్‌ బెల్ట్‌

- వేగం పుంజుకోనున్న సహాయక చర్యలు

- 13.600 నుంచి 13.730 కిలో మీటర్ల వరకు బెల్ట్‌ పొడిగింపు

దోమలపెంట, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో బురద మట్టి శిథిలాలను తొలగించేందుకు కన్వేయర్‌ బెల్ట్‌ పాత్ర కీలకం. సహాయక చర్యల్లో వేగం పేంచేందుకు రెస్క్యూ బృం దాలు మూడు రోజులు శ్రమించి కన్వేయ ర్‌ బెల్ట్‌ ట్రాక్‌ను బుధవారం 13.600 కిలో మీటర్ల నుంచి 13.730 కిలో మీటర్లకు పొడిగిస్తూ సిద్ధం చేశారు. దీంతో పాటు టీబీ ఎంకు సంబం ధించిన ఇనుప గడ్డర్లను రెస్క్యూ బృందాలు ప్లాస్మా, గ్యాస్‌, థర్మల్‌ కట్టర్లతో కత్తిరించి లోకో ట్రైన్‌ ద్వా రా బయటకు తరిలిస్తున్నారు. గరు వారం నుంచి కన్వేయర్‌ బెల్ట్‌పై మట్టి బురద తరలించడంతో పాటు, ఎక్స్‌కవేటర్లతో తవ్వ కాలు చేపట్ట నున్నట్లు సహాయ చర్యలో పాల్గొనే రెస్క్యూ బృందాల అధికారులు చెబుతున్నారు.

Updated Date - Apr 02 , 2025 | 11:42 PM