ఉగాది కానుకగా ఉచిత సన్నబియ్యం
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:46 PM
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఉగాది పండుగ కానుకగా ప్రతీ ఒక్కరికి ఆరుకిలోల చొప్పున సన్నబియ్యం ఉచిత పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

ధరూరులో కలెక్టర్‌తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
అలంపూర్ నియోజకవర్గంలో బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయుడు
ధరూరు, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఉగాది పండుగ కానుకగా ప్రతీ ఒక్కరికి ఆరుకిలోల చొప్పున సన్నబియ్యం ఉచిత పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. రా ష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకా లను అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుం టామన్నారు. బుధవారం ధరూర్‌లోని పంచాయ తీ కార్యాలయం వద్ద కలెక్టర్ బీఎం సంతోష్‌తో కలిసి ఆయన సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు పం పిణీ చేసి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం లో సీఎం నేతృత్వంలో దేశంలో ఎక్కడాలేని వి ధంగా తెలంగాణలో ప్రతీ పేద కుటుంబానికి సన్నబియ్యం పంపణీ చేయడం చారిత్రక నిర్ణయమన్నారు. త్వరలోనే కొత్తరేషన్ కార్డులను కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందాలి : ఎమ్మెల్యే విజయుడు
అలంపూరు : రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అం దిస్తున్న సన్నబియ్యా న్ని రేషన్ డీలర్లు ప్రతి లబ్ధిదారునికి ఎలాంటి ఇబ్బందిలేకుండా పంపిణీ చేయాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు చె ప్పారు. బుధవారం ఆయన మునిసిపాలిటీ పరి ధిలోని ఇమాంపురంలో తహసీల్దార్ మంజులతో పాటు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పా ల్గొన్నారు. రిబ్బన్‌కట్ చేసి లబ్ధిదారులకు సన్న బియాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో మం డల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వ ర్లు, మునిసిపాలిటీ మాజీ చైర్మన్ శేఖర్‌రెడ్డి, బీ ఆర్‌ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు ఇల్లూరి వెంకట్రా మయ్య శెట్టి, రేషన్ డీలర్లు, ఆర్‌ఐ మాసుం, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.