హెచ్‌సీయూ భూముల జోలికివస్తే ఉద్యమం తప్పదు
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:09 PM
గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్‌గా ఖ్యాతిగాంచిన సెం ట్రల్ యూనివర్సిటీ భూములను లాక్కునే ప్ర యత్నం చేస్తే బీఆర్‌ఎస్ పార్టీ, బీఆర్‌ఎస్వీ ఆధ్వ ర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని బీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య అన్నారు.

బీఆర్‌ఎస్వీ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య
గద్వాల టౌన్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్‌గా ఖ్యాతిగాంచిన సెం ట్రల్ యూనివర్సిటీ భూములను లాక్కునే ప్ర యత్నం చేస్తే బీఆర్‌ఎస్ పార్టీ, బీఆర్‌ఎస్వీ ఆధ్వ ర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని బీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య అన్నారు. హెచ్‌సీ యూలోని 400 ఎకరాలను స్వాధీనం చేసుకు నేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని వ్య తిరేకిస్తూ మంగళవారం గద్వాల పీజీ కేంద్రం వద్ద బీఆర్‌ఎస్వీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు.ఈసందర్భంగా మాట్లాడిన పల్లయ్య, 1970లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చొర వతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వ హించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సి టీని ఏర్పాటు చేయగా, అదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో భూములను వేలం వేసే ప్రయత్నం చేయడం సిగ్గు చేటన్నారు. కో ర్టుకు సెలవులు ఉన్న రోజుల్లో బుల్డోజర్ల సహాయంతో హెచ్‌సీయూ భూములను స్వాధీనం చేసుకుంటున్న తీరును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై నాన్ బెయిలబుల్ కేసు లు పెట్టడం దివాళాకోరుతనమన్నారు. ప్రభు త్వం వెంటనే భూముల స్వాధీనాన్ని నిలుపుద ల చేయాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్ర మంలో రాజశేఖర్, మాధవ్, మహేష్, ప్రకాష్, పవన్, రాజు, బలిచక్రవర్తి, ధనరాజ్, అభి, నరేంద్ర, బాలు ఉన్నారు.