‘వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాలి’
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:17 PM
వక్ఫ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా వెనక్కి తీసుకోవాలని జమాతే ఇస్లామిక్ హింద్, ఎంఐఎం ఆధ్వర్యంలో శుక్రవారం ఊట్కూర్ తహసీల్దార్ కార్యాలయం వద్దకు ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు.

మక్తల్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): వక్ఫ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా వెనక్కి తీసుకోవాలని జమాతే ఇస్లామిక్ హింద్, ఎంఐఎం ఆధ్వర్యంలో శుక్రవారం ఊట్కూర్ తహసీల్దార్ కార్యాలయం వద్దకు ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామిక్ హింద్ నాయకుడు మన్సూర్‌అలీ, ఎంఐఎం నాయకుడు మొహ్మద్ ఇస్మాయిల్ మా ట్లాడుతూ దేశవ్యాప్తంగా ముస్లింలు మైనార్టీల ఆస్తులకు రక్షణగా ఉన్న భూములను ప్రభుత్వాలు చట్టం ద్వారా వెనక్కి తీసుకోవాలని చూస్తు న్నాయన్నారు. ఈ భూముల్లో అనేక మంది పేద మైనార్టీలు బతుకుతున్నారన్నారు. వెంటనే చట్టం రద్దు చేయాలన్నారు. అంతకుముందు పంచ్ మసీద్ నుంచి మెయిన్‌రోడ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వ హించి, తహసీల్దార్ రవికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అబ్దుల్ ఖాలీక్, కుర్షీద్, రహెమాన్, మక్బూల్‌అహ్మద్, ఇబ్రహీం, అబ్దుల్ కాలిక్, రషీద్, మొహ్మద్ మారిక్, జమీల్, రహీం, జావిద్ తదితరులున్నారు.