Share News

దరఖాస్తు చేసిన ప్రతీ అర్హుడికి ఇల్లు ఇవ్వాలి

ABN , Publish Date - Apr 04 , 2025 | 11:54 PM

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఓట్లు దండుకున్న కాంగ్రెస్‌, ఇప్పుడు దర ఖాస్తు చేసుకున్న ప్రతీ అర్హుడికి ఇందిర మ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ కురువ విజయ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

దరఖాస్తు చేసిన ప్రతీ అర్హుడికి ఇల్లు ఇవ్వాలి

రాజీవ్‌ యువ వికాసం పేరుతో మోసం చేస్తున్న ప్రభుత్వం

విలేకరుల సమావేశంలో డాక్టర్‌ కురువ విజయ్‌ కుమార్‌

గద్వాల/గద్వాల న్యూటౌన్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఓట్లు దండుకున్న కాంగ్రెస్‌, ఇప్పుడు దర ఖాస్తు చేసుకున్న ప్రతీ అర్హుడికి ఇందిర మ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ కురువ విజయ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం పార్టీ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పథకాల పేరుతో ఓట్లు దండుకొని ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. గద్వాల, అలంపూర్‌ నియోజకవ ర్గంలో 1,40,413 దరఖాస్తులు వచ్చాయని తెలి పారు. ఇందులో ప్లాట్లు ఉండి ఇల్లు లేని వారు (ఎల్‌-1) 50,918 మంది, ప్లాట్లు, ఇల్లు లేనివారు(ఎల్‌-2) 18,670మంది, గుడిసెలు, రేకులషె డ్లు ఉన్నవారు 70,765మంది ఉన్నారని వివరించారు. వీరంతా ఇందిరమ్మ ఇల్లు పొందేందుకు అర్హులని తెలిపారు. కానీ ప్రభుత్వం మోడల్‌ విలేజ్‌లుగా 13మండలాల్లో 13 గ్రామాలను ఎం పిక చేసి 1,534ఇళ్లు మంజూరు చేసిందని వివరించారు. మరి మిగిలిన గ్రామాల్లోని ఇళ్ల దర ఖాస్తుదారులకు ఇళ్లు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పథకాలపేరుతో ప్రజలను మోసం చేసి న మీకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించా రు. రాజీవ్‌ యువవికాసం పేరుతో దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, రాజకీయాలకు తావు లేకుం డా అర్హులైన వారిని ఎంపిక చేయాలని కోరారు. పురాతన కాలంనాటి ఆస్థులను పరిరక్షించాల్సి న బాధ్యత అధికారులదేనని వివరించారు. కొత్తబావిని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్‌ చే శారు. జిల్లాకేంద్రంలో మట్టి, ఇసుక మాఫియా చెలరేగిపోతున్నా అధికారులు కండ్లు మూసుకొ ని ఉన్నారని విమర్శించారు. గద్వాల నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో అధికార మార్పు తప్పదని సూచించారు. అధికారులు దానిని గుర్తించుకొని పనిచేయాలని హె చ్చరించారు. సమావేశంలో ప్రతాప్‌రెడ్డి, రాము, శ్రీనివాస్‌, నర్సింహ, రామాంజనేయులు, రవికుమార్‌, నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 11:54 PM