సుప్రీం తీర్పును అమలు చేయాలి
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:17 PM
అంగన్‌వాడీలకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తక్షణమే అమలు చేయాలి.

పాలమూరు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : అంగన్‌వాడీలకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తక్షణమే అమలు చేయాలి. మోదీ తెచిచన నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలి. ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే పీఎంశ్రీ మొబైల్ సెంటర్స్‌ను ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో 48 గంటల ధర్నా ముగిసింది. మంగళవారం కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీలు ధర్నాలో వారు మాట్లాడారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. కిల్లె గోపాల్, ఆర్.రాంరెడ్డి, అంగన్‌వాడీల జిల్లా అధ్యక్షురాలు సరోజ, ఉపాధ్యక్షురాలు కమల, గౌసియా, ప్రభావతి, అనురాధ, సత్యమ్మ మాట్లాడుతూ ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేయడంలో భాగంగానే మొబైల్ సెంటర్‌ను, బడ్జెట్ తగ్గించటం కేంద్ర ప్రభుత్వం అడుగు వేసిందన్నారు. మంత్రి సీతక్క ఇచ్చిన హామీ మేరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ కొత్త జీవో జారీ చేయాలన్నారు. ఎండాకాలంలో ఒంటి పూట బడి, మే నెలలో టీచర్, ఆయాకు సెలవులు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా 48 గంటల ధర్నాను విరమించారు.