Share News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:39 PM

రోడ్డు ప్రమా దంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల పరిధిలోని కోదండాపురం స్టేజీ దగ్గర మంగళవారం అర్ధరాత్రి చోటుచేసు కున్నది.

రోడ్డు ప్రమాదంలో  ఇద్దరి దుర్మరణం

- ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు

ఎర్రవల్లి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమా దంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల పరిధిలోని కోదండాపురం స్టేజీ దగ్గర మంగళవారం అర్ధరాత్రి చోటుచేసు కున్నది. కొదండాపురం ఎస్‌ఐ మురళి కథనం ప్రకారం మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన హరిజన బీసన్న(36), రఫీ(62)లు కలిసి ద్విచక్ర వాహనంపై తమ పని నిమిత్తం వచ్చి కోదండాపురం దగ్గర అర్ధరాత్రి జాతీయ రహదారిని దాటుతున్నారు. అదే సమయంలో బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వైపు వెళుతున్న కారు అతి వేగంతో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో రక్తస్రావమై ఉన్న హరిజన బీసన్న, రఫీలను హైవే అంబులెన్స్‌ సిబ్బంది గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - Mar 19 , 2025 | 11:39 PM