Share News

కాంగ్రెస్‌ నాయకులు సంబురాలు

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:29 PM

తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్‌ బిల్లు విప్లవాత్మకమైన చర్య అని, అలాగే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంపై కాంగ్రెస్‌ నాయకులు బుధవారం జడ్చర్లలో సంబురాలు జరుపుకున్నారు.

కాంగ్రెస్‌ నాయకులు సంబురాలు
నవాబ్‌పేటలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు

- బీసీ రిజర్వేషన్‌ బిల్లు, ఎస్పీ వర్గీకరణ చట్టబద్ధతపై సీఎం రేవంత్‌రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం

జడ్చర్ల, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్‌ బిల్లు విప్లవాత్మకమైన చర్య అని, అలాగే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంపై కాంగ్రెస్‌ నాయకులు బుధవారం జడ్చర్లలో సంబురాలు జరుపుకున్నారు. జడ్చర్ల పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మహత్మజ్యోతిరావు పూలే, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు.

మూసాపేట : అడ్డాకుల మండలం కందూరులో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంతో ఎస్సీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

మిడ్జిల్‌ : మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అల్వాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగాళ్ల సురేష్‌మాదిగ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చుతు, మిఠాయిలు పంచిపెట్టారు.

నవాబ్‌పేట : కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మాడెమోని నర్సింహులు ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చౌరస్తాలో సీఎం రేవంత్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.

కోయిలకొండ : కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రవీందర్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు విద్యాసాగర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

పాలమూరు : ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాయికంటి రాందాసు పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి హర్షం వ్యక్తం చేశారు. బీసీ సమాజ్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీలో 42శాతం అమలుకు బిల్లుపెట్టి ఆమోదం తెలపటంపై సీఎం రేవంతర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

దేవరకద్ర : స్థానిక సంస్థలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం తెలిపిసందకు కాంగ్రెస్‌ నాయకులు, బీసీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జీఎంఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

Updated Date - Mar 19 , 2025 | 11:33 PM