ఆశాలకు కనీసవేతనం రూ.18 వేలు ఇవ్వాలి
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:28 PM
ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దీప్లానాయక్, నల్లవెల్లి కురుమూర్తి డిమాండ్ చేశారు.

పాలమూరు, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దీప్లానాయక్, నల్లవెల్లి కురుమూర్తి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సభ జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశలకు పీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ, పింఛన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు, సీనియర్ నాయకులు కిల్లె గోపాల్, ఖమర్‌అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.18 వేలు వేతనం ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. బీవోసీ కార్యదర్శి వరద గాలెన్న, అవాజ్ నాయకులు జహంగీర్ మద్దతు ప్రకటించారు. ఆశ యూనియన్ జిల్లా నాయకులు సావిత్రి, పద్మ, యాదమ్మ, హైమావతి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సౌజన్య, అనంతమ్మ, అమృత, పద్మ, కాంతమ్మ పాల్గొన్నారు.