Share News

నీటికోసం వన్యప్రాణుల ఆరాటం

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:41 PM

నల్లమల అడవి పెద్ద పులులు, చిరుతలు, ఎన్నో రకాల వన్య ప్రాణులకు నెలవు.

నీటికోసం వన్యప్రాణుల ఆరాటం
సాసర్‌ పిట్‌లో నింపిన నీరు తాగేందుకు వచ్చిన పులి(ఫైల్‌)

- నల్లమలలో ఎండుతున్న జలధారలు, చెలిమలు

- నీటి సౌకర్యం కల్పించే పనిలో అటవీశాఖ అధికారులు

- సోలార్‌ మోటార్ల ఏర్పాటుకు ప్రధాన్యం

అచ్చంపేట, మార్చి19 (ఆంధ్రజ్యోతి): నల్లమల అడవి పెద్ద పులులు, చిరుతలు, ఎన్నో రకాల వన్య ప్రాణులకు నెలవు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని 20 రెవెన్యూ మండలా ల్లో నల్లమల విస్తరించి ఉంది. ఈ అడవిలో పెద్దపులు లు, చిరుతలు, ఎలుగుబంట్లు, నక్కలు, అడవి కుక్కల వంటి మాంసాహార జంతువులతో పాటు శాఖహార జంతువులై న సాంబర్‌, మనుబోతు, చుక్కలదుప్పి, అడవిపందులు, ముళ్లపంది, చౌసింఘాతోపాటు మరెన్నో రకాల వన్య ప్రాణులు జీవిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 32పులులు, 176 చిరుత పులులు, 250 ఎలుగు బంట్లు, 10వేలకు పైగా ఇతర వన్య ప్రాణులు జీవిస్తు న్నాయి. ఈ జంతువులన్నీ తాగునీటి కోసం తండ్లాడు తున్నాయి. ప్రతీ ఏటా వేసవిలో ఎదురయ్యే నీటి సమ స్యను అధిగ మించేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 2వేల హెక్టార్లలో ఒక సోలార్‌ మోటర్‌ను ఏర్పాటు చేసి ఎటూ 4వేల హెక్టార్ల పరిధి వరకు ఆ ప్రాంతంలో సాసర్‌పిట్లకు నీరు అందింస్తున్నారు. స్వచ్ఛంధ సంస్థలు, దాతల సహాకారం తో నల్లమల లో సోలార్‌ పంపులను ఏర్పాటు చేశారు.

ఎండుతున్న వాగులు వంకలు

నల్లమల అభయారణ్యంలో జీవిస్తున్న జంతువులకు జీవనాధారంగా ఉన్న ఎన్నో వాగులు, వంకలు ఎండి పోతున్నాయి. దీంతో నీరు లభించే ప్రాంతాలకు వన్య ప్రాణులు వెళ్తున్నాయి. అక్కడే మాటువేసిన మాంసాహా ర జంతువులు, వేటగాళ్ల చేతుల్లో చిక్కి మృత్యువాత పడుతున్నాయి. ప్రధానంగా వటువర్లపల్లి సమీపంలోని కానుగుల చెరువు, తుర్కబండల వాగు, కిన్నెరగుండం, జువికాలువ, ధారవాగు, మక్కలేటివాగు, తురముబండ లు, సుద్దబొక్కల వాగు, మేకపోతుగుండం, మల్లెల తీర్థం వాగు, పొగసురువాగు వంటి జలవనరులు ఎండ ల తీవ్రతతో ఎండిపోతున్నాయి.

శాశ్వత పరిష్కారానికి కృషి

నల్లమల అభయారణ్యంలో వేసవిలో రెండు ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్నాం. అడువులకు నిప్పురాజుకో వడం, వన్యప్రాణులకు నీటి సమస్య, ఈ రెండు సమస్యలను పరిష్కరించుకునేం దుకు క్షేత్రస్థాయిలో మా సిబ్బంది కృషి చేస్తున్నారు. ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగిన తక్షణమే అక్కడికి వెళ్లి ప్రమాదం నివారించేందుకు చర్య లు చేపడుతున్నాం. వన్యప్రాణుల కు అందు బాటులో నీటి సౌకర్యం ఉండేలా చెక్‌డ్యాంలు ఏర్పాటు చేస్తున్నాం. నీటి సమస్యను శాశ్వ తంగా పరిష్కరించేందుకు స్వ చ్ఛంద సంస్థల సహాకారంతో సోలార్‌ పంపుసెట్లను ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని చోట్ల సాస ర్‌ పిట్లను ఏర్పాటు చేసి నీళ్లు నింపుతున్నాం.

Updated Date - Mar 19 , 2025 | 11:41 PM