కూలీల సంఖ్య పెంచాలి
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:37 PM
ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచాలని కలెక్టర్ బీఎం సంతోష్ సూ చించారు.

గద్వాల, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచాలని కలెక్టర్ బీఎం సంతోష్ సూ చించారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని తాటికుంట, పెద్దొడ్డి, మల్దకల్, అమరవాయి, గద్వాల మండలం కుర్వపల్లి గ్రామాల్లో ఉపాధి పనులను పరిశీలించారు. పెద్దొడ్డి గ్రామం లో ఉపాధి హామీ పనుల వద్దకు వాహనా లు వెళ్లే సౌకర్యం లేకపోవడంతో బైక్‌పై వెళ్లాడు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి అప్‌డేట్ లేక పోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ పనికి సంబంధించిన రికార్డులతో పాటు మస్టర్లను, కూలీల జాబ్‌కార్డులను అప్‌డేట్ చేసి ఉంచాల ని సూచించారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నం దున ఉదయం వేళల్లో పనులు పూర్తి చేసుకోవాల న్నారు. నర్సరీలను పరిశీలించి మొక్కలకు ప్రతీ రోజు నీరు పోయాలని సూచించారు. తాగునీటి పైపులు లీకేజీలు లేకుండా చూడాలని, రోడ్ల వెంట మురుగునీరు నిల్వ ఉండొద్దని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అమరవాయి గ్రామంలో ఉపాధి పథకం ద్వారా వేస్తున్న సీసీ రోడ్లను పరిశీలించారు.