పది పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:15 PM
పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 60, నారాయణపేట జిల్లాలో 39 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌లో 99.68 హాజరు శాతం నమోదైంది. కేంద్రాల్లోకి విద్యార్థులను గంట ముం దే అనుమతించారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో 60, నారాయణపేట జిల్లాలో కేంద్రాల 39 ఏర్పాటు
పాలమూరులో 99.68 హాజరు శాతం నమోదు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం/నారాయణపేట, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 60, నారాయణపేట జిల్లాలో 39 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌లో 99.68 హాజరు శాతం నమోదైంది. కేంద్రాల్లోకి విద్యార్థులను గంట ముం దే అనుమతించారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు కొనసాగాయి. జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ రోడ్డు ఉన్నత పాఠశాల, క్రీస్తు జ్యోతి విద్యాలయం, భూత్పూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, ప్రశ్నప్రతాల రికార్డులను పరిశీలించారు. కేంద్రాలకు విద్యుత్ నిరంతరం సరఫరా జరిగేలా చూడాలన్నారు. ఎండల దృష్ట్యా విద్యార్థులు అస్వస్థతకు గురైతే సేవలు అందించేందుకు ఓఆర్‌ఎస్, మందులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో ఎలకా్ట్రనిక్ పరికరాలు, సెల్‌ఫోన్లు అనుమతించ కూడదన్నారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీఎల్‌వో ఐదు, డీఈవో 11 కేంద్రాలను పరిశీలించారు.
పాలమూరులో 12,744 మంది హాజరు
జిల్లా వ్యాప్తంగా 12,785 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 12,744 మంది విద్యార్థులు హాజరయ్యారు. 42 మంది గైర్హాజరు అయ్యారు. 99.68 హాజరు శాతం నమోదైంది. మొదటి రోజు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సందడి నెలకొంది. పాలమూరులో విద్యార్థులు హాల్ టికెట్లు గుడిలో పెట్టి పూజలు చేయించారు. జిల్లా కేంద్రంలోని రేణుక ఎల్లమ్మదేవాలయం విద్యార్థులతో రద్దీగా మారింది.
నారాయణపేటలో 22 మంది గైర్హాజరు
నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 7,631 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 7,613 మంది హాజరయ్యారు. 22 మంది గైర్హాజరు అయ్యారు. రాష్ట్ర పరిశీలకులు దుర్గప్రసాద్, కలెక్టర్ సిక్తాపట్నాయక్, డీఈవో గోవిందరాజులు కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల వద్దకు విద్యార్థులు ఎనిమిదిన్నరకే చేరుకున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్ష సమయంలో ఇంటర్‌నెట్, జారిక్స్, స్టేషనరీ దుకాణాలను మూసివేయించారు.