ముగిసిన ఒకేషనల్ పరీక్షలు
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:49 PM
జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియ ట్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సు పరీక్షలు శనివారంతో ముగిశాయి.

వనపర్తి విద్యావిభాగం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియ ట్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సు పరీక్షలు శనివారంతో ముగిశాయి. జిల్లా వ్యా ప్తంగా ఏర్పాటు చేసిన ఐదు సెంటర్లలో చివరి రోజు 837 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 793 మంది విద్యార్థులు మాత్రమే హా జరయ్యారని, 44 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని వా గ్దేవి, స్కాలర్స్, జూనియర్ కళాశాల సెంటర్లలో చివరి రోజు పరీక్షలు కొనసాగిన తీరును డీఐఈ వో తనిఖీ చేశారు.