Share News

మొదలైన ‘పది’ పరీక్షలు

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:43 PM

పదో తరగతి వార్షిక పరీక్షలు నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల జిల్లాల్లో మొదటి రోజు ప్రశాంతంగా కొనసాగాయి.

 మొదలైన ‘పది’ పరీక్షలు
నాగర్‌కర్నూల్‌ జడ్పీహెచ్‌ఎస్‌ బాలుర కేంద్రం వద్ద హాల్‌టికెట్‌ నెంబర్లు చూసుకుంటున్న విద్యార్థులు

- నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 60 కేంద్రాల్లో 10,528 మంది హాజరు

- వనపర్తి జిల్లాలో 36 కేంద్రాల్లో హాజరైన 6842 మంది విద్యార్థులు

- గద్వాల జిల్లాలో 40 కేంద్రాల్లో పరీక్ష రాసిన 7,565 మంది

నాగర్‌కర్నూల్‌ టౌన్‌/వనపర్తి రూరల్‌/గద్వాల సర్కిల్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి వార్షిక పరీక్షలు నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల జిల్లాల్లో మొదటి రోజు ప్రశాంతంగా కొనసాగాయి. నాగర్‌కర్నూల్‌ వ్యాప్తంగా 60 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 10,557 మందికి గాను 10,528 మంది హాజరయ్యారు. కలెక్టర్‌ బ దావత్‌ సంతోష్‌ అమ్రాబాద్‌ మండల పరిధిలోని దోమల పెంట పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్షల నిర్వహణ తీ రును పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ అమరేందర్‌ జిల్లా విద్యాధికారి రమేష్‌కుమార్‌తో కలిసి జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రాంతీయ విద్యా సంచాలకురాలు, పదో తరగతి రాష్ట్ర పరిశీలకురా లు విజయలక్ష్మి కల్వకుర్తి పట్టణంలోని పలు పరీక్ష కేం ద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష సమయం ముగిసిన వెంటనే జిల్లా వ్యాప్తంగా 60 పరీక్ష కేంద్రాల్లో జవా బు పత్రాలను సీజ్‌ చేసి వాటి పరిధిలోని 18 పోలీ సుస్టేషన్లకు తరలించి సమీప పోస్టాఫీసుల్లో భద్రపరిచినట్లు రమేష్‌కుమార్‌ తెలిపారు.

- వనపర్తి జిల్లా కేంద్రంలో శుక్రవారం ప్రా రంభమైన పది పరీక్షలు మొదటి రోజు ప్రశాం తంగా కొనసాగాయి. జిల్లాలో 36 పరీక్షా కేంద్రా ల్లో మొత్తం 6853 మంది విద్యార్థులు పరీ క్షలు రాయాల్సి ఉండగా మొదటి రోజు 6842 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ రావుల గిరిధర్‌ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. డీఈవో మహమ్మద్‌ అబ్దుల్‌ ఘని, స్థానిక తహసీ ల్దార్‌ రమేష్‌ రెడ్డి ఉన్నారు.

- జోగుళాంబ గద్వాల జిల్లా వ్యా ప్తంగా 40 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి రోజు జరిగిన తెలుగు/ఉర్దూ పరీక్షకు 99.58 శాతం విద్యార్థులు హాజరైనట్టు ఇన్‌చార్జి డీఈవో అహ్మద్‌ ఘని, పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7,597 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 7,565 మంది హాజరయ్యారని పేర్కొన్నా రు. గద్వాలలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 8 మంది అంధ విద్యార్థులు సహాయకుల(స్ర్కైబర్స్‌)చే పరీక్షలు రాసినట్టు వివరించారు. కలెక్టర్‌ సంతోష్‌, ఎస్పీ శ్రీనివాసరావులు వేర్వేరుగా పలు కేంద్రాలను తనిఖీ చేశారు. కాగా ఇన్‌చార్జి డీఈవో కొండేరులోని జడ్పీహెచ్‌ఎస్‌, ఎర్రవల్లిలోని పద వ పటాలంలో ఉన్న జడ్పీహెచ్‌ఎస్‌, పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గద్వాల ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

Updated Date - Mar 21 , 2025 | 11:43 PM