జల సంరక్షణే ప్రాణ సంరక్షణ
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:48 PM
జ ల సంరక్షణే ప్రాణ సంరక్షణ అని, జిల్లా భూ గర్భ జలశాఖ అధికారిని దివ్యజ్యోతి అన్నారు.

పెద్దమందడి, మార్చి 22, (ఆంధ్రజ్యోతి) : జ ల సంరక్షణే ప్రాణ సంరక్షణ అని, జిల్లా భూ గర్భ జలశాఖ అధికారిని దివ్యజ్యోతి అన్నారు. శ నివారం పామిరెడ్డిపల్లిలో నిర్వహించిన ప్రపం చ జల దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ విశ్వంలో స మస్త జీవకోటికి నీరే ఆధారమన్నారు. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటి పోతున్న తరుణం లో నీటిని పొదుగా వాడుకోవాలని సూచించా రు. హెచ్‌ఓ శ్రీకాంత్, శ్రీవాణి, కురుమయ్య, ఏ ఈవో మధు, కృష్ణవేణి, సువర్ణ పాల్గొన్నారు.