ఘనంగా ప్రపంచ నీటి దినోత్సవం
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:22 PM
ధన్వాడ మండల కేంద్రంలో శనివారం ప్రపంచ నీటి దినోత్సవాన్ని జ రుపుకున్నారు.

- జల సంరక్షణపై పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన
ధన్వాడ/కోస్గి/కోస్గి రూరల్/మరికల్/మక్తల్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ధన్వాడ మండల కేంద్రంలో శనివారం ప్రపంచ నీటి దినోత్సవాన్ని జ రుపుకున్నారు. ఈ సందర్భంగా బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రామంలోని పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. నీటి సంరక్షణపై నినాదాలు చేస్తు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో హెచ్‌ఎం నీటి సంరక్షణ గురించి విద్యార్థులకు వివరించారు. నీటిని వృథా చేయొద్దన్నారు. నీటి సంరక్షణలో అందరు పాల్పంచుకోవాలన్నారు. కార్యక్రమంలో వెంకటేష్, ఫరీదాసుల్తానా, సుభాషినిలు పాల్గొన్నారు.
అదేవిధంగా, పేట జిల్లా పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వాక్‌ఫర్ వాటర్ వలంటీర్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో జల ప్రతిజ్ఞ చేశారు. వలంటీర్ వీరమల్లేష్, ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కోస్గి మండలం మీర్జాపూర్ గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జల సంరక్షణపై యంగ్ ఎర్త్ లీడర్ సమన్వయకర్త, పాఠశాల ఉపాధ్యాయుడు వార్ల మల్లేశం అవగాహన కల్పించారు. వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని, భూగర్భ జలాలను పెంచే చర్యలు చేపట్టాలన్నారు. జల సంరక్షణ కోసం కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
మరికల్‌లోని శ్రీవాణి పాఠశాల విద్యార్థులు గ్రామ పురవీధుల గుండా ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇందిరాగాంఽధీ చౌర స్తాలో నీటి వినియోగంపై ప్రజలకు నాటక రూపంలో నృత్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ వీనతమ్మ మాట్లాడారు. కరస్పాండెంట్ పూర్ణిమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మక్తల్ పట్టణంలోని న్యూనోబుల్ టాలెంట్ పాఠశాల ప్రిన్సిపాల్ నిర్మల విద్యార్థులను పాలమూరు జిల్లా కేంద్రంలోని మయూరీ పార్కుకు తీసుకువెళ్లి మొక్కలు, నీటి పొదుపుపై అవగాహ న కల్పించారు. అనంతరం విద్యార్థులచే నీటి పొదుపుపై ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల డైరెక్టర్లు నాగరాజు, నింగప్ప, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శీలించారు.