Share News

BJP: అప్పుల్లో తెలంగాణ రైజింగ్‌: ఏలేటి

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:49 AM

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సీఎంను భయపెడుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎత్తి వేసే ప్రమాదముందని ప్రజలు భయపడుతున్నారని చెప్పారు.

BJP: అప్పుల్లో తెలంగాణ రైజింగ్‌: ఏలేటి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సీఎంను భయపెడుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎత్తి వేసే ప్రమాదముందని ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. తెలంగాణ రైజింగ్‌ అని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని, కానీ వాస్తవానికి తెలంగాణ అప్పులు తేవడంలో రైజింగ్‌గా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి గతంలో వచ్చిన అప్పుల అప్పారావు, రొటేషన్‌ చక్రవర్తి సినిమాల మాదిరిగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ చేసిన ఆర్థిక విధ్వంసంపై ఎలాంటి చర్యలు చేపడతామనే విషయాన్ని కాంగ్రెస్‌ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 28 , 2025 | 03:49 AM