Share News

ఏపీ నుంచి హైదరాబాద్‌కు ఇసుక

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:18 AM

ఇసుకను అకమ్రంగా తరలిస్తున్న లారీని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్‌ పోలీసులు సోమవారం సీజ్‌ చేశారు.

ఏపీ నుంచి హైదరాబాద్‌కు ఇసుక

మిర్యాలగూడ వద్ద పట్టుకున్న పోలీసులు

మిర్యాలగూడ అర్బన, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : ఇసుకను అకమ్రంగా తరలిస్తున్న లారీని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్‌ పోలీసులు సోమవారం సీజ్‌ చేశారు. ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కిష్టాపురం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఓవర్‌లోడ్‌తో ఆంధ్రప్రదేశ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న లారీని ఆపి లోడుకు సంబంధించిన పత్రాలను పరిశీలించగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ రాష్ట్రం బాపట్ల జిల్లా చిన్నగంజం నుంచి హైదరాబాద్‌కు ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో టీఎస్‌ 05యూడీ1225 నెంబరుగల లారీ డ్రైవర్‌ బత్తుల రాజును అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తనిఖీలో పట్టుబడ్డ లారీ నల్లగొండ పట్టణానికి చెందిన రాచకొండ నగే్‌షగౌడ్‌కు చెందినదిగా గుర్తించినట్లు రూరల్‌ ఎస్‌ఐ తెలిపారు. ఎలాంటి అనుమతి ప్రతాలు లేకుండా ఇసుక అక్రమరవాణాకు పాల్పడుతున్న లారీని సీజ్‌ చేసి డ్రైవర్‌ రాజుతోపాటు, సదరు వాహనం యజమాని నగే్‌షగౌడ్‌పై కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు.

Updated Date - Apr 08 , 2025 | 12:18 AM