ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుంది
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:36 AM
ఎండిపోయిన పొలాల రైతుల ఉసురు సీఎం రేవంతరెడ్డికి తప్పక తగులుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

పెనపహాడ్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : ఎండిపోయిన పొలాల రైతుల ఉసురు సీఎం రేవంతరెడ్డికి తప్పక తగులుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. మండలంలోని దుబ్బతండా గ్రామంలో రైతు లూనావత అనిల్‌కు చెందిన ఏడు ఎకరాల వరి పొలం, రత్యాతండాకు చెందిన భూక్యా లింగ్యా రెండు ఎకరాల వరి పొలం పూర్తిగా ఎండిపోవడంతో ఆయన మంగళవారం వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంతరెడ్డి ఎన్నికల ముందు 420హామీలు, ఆరుగ్యారెంటీ పథకాలు ఇస్తామని చెప్పి ప్రజలను మాయ చేసి గద్దెపై కూర్చుని ఇప్పుడు వాటిని అమలుపరచడంలో విఫలమయ్యారని తెలిపారు. కాళేశ్వరం, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల నుం చి సాగునీరు అందించడంలో ప్రభుత్వం అసమర్థత గా వ్యవహరించడంతో వేలాదిఎకరాలు ఎండిపోయి రైతులు తలలు పట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు ఇవ్వకపోగా, రుణమాఫీ చేయకపోగా, సన్నధాన్యానికి బోనస్ అందించక, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలకు మోసపోయిన రైతుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక లా తయారైందన్నారు. రేవంతరెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంటే కేసీఆర్ ప్రభుత్వమే బా గుందని ప్రజలు పునరాలోచనలో పడ్డారని తెలిపా రు. సూర్యాపేట నియోజకవర్గంలో పెనపహాడ్‌తో పాటు మోతె, చివ్వెంల, ఆత్మకూరు(ఎస్), సూర్యాపేటరూరల్ మండలాల్లోని గ్రామాల్లో ఏగ్రామం వెళ్లినా ఎండిపోయిన పొలాలు దర్శనమిస్తున్నాయన్నారు. పెట్టుబడి వచ్చే పరిస్థితి లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని తెలిపారు. అసెంబ్లీలో ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే తనను సస్పెండ్ చేశారన్నా రు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న సీఎం రేవంతరెడ్డి ప్రభుత్వం పాలకులను బట్టలు ఊడదీసి కొట్టే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు గోపగాని వెం కటనారాయణగౌడ్, నిమ్మల శ్రీనివా్‌సగౌడ్, నెమ్మాది బిక్షం,బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దొంగరి యుగేంధర్, వెన్న సీతారాంరెడ్డి, మిర్యాల వెంకటేశ్వర్లు, తూ ముల ఇంద్రసేనరావు, ఊరుకొండ రాధాకృష్ణ, బిట్టు నాగేశ్వర్‌రావు, కొండేటి సుధాకర్, ఫరుద్దీన, జ్యోతినాయక్, సైదానాయక్, రవీందర్‌నాయక్, కృష్ణ, శ్రీను, గోపి పాల్గొన్నారు.