Share News

సన్న బియ్యం.. సంతోషం

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:40 AM

రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం కింద తొలిసారి బియ్యం అందుకున్న మహిళలు ఆ బియ్యం బాగున్నాయని, అన్నం బాగా అయిందని సంబరపడుతున్నారు.

సన్న బియ్యం.. సంతోషం

బియ్యం పంపిణీ చేసిన తొలిరోజే వండుకున్న మహిళలు

అన్నం బాగుందని కితాబిచ్చిన ఉమ్మడి జిల్లా మహిళలు

నల్లగొండ,ఏప్రిల్‌2 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం కింద తొలిసారి బియ్యం అందుకున్న మహిళలు ఆ బియ్యం బాగున్నాయని, అన్నం బాగా అయిందని సంబరపడుతున్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో, నల్లగొం డ జిల్లా కనగల్‌ మండలం జి.యడవల్లిలో తొలిరోజు సన్నబియ్యం పొందిన మహిళలను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. ప్రభుత్వమిచ్చిన బియ్యాన్ని వారు వండి చూ శారు.బియ్యం నాణ్యతతో ఉన్నాయని, గతంలో మార్కెట్లో తాము కొన్న సోనామసూరి, బీపీటీ తరహాలోనే ఈ బియ్యం కూడా ఉన్నాయని, పచ్చిబియ్యమే వచ్చిందని తెలిపారు. బియ్యం వండిన అన్నాన్ని కూడా ‘ఆంధ్రజ్యోతి’ బృందానికి చూపించారు. గతంలో ఇచ్చిన రేషన్‌ బియ్యం దొడ్డుబియ్యం వండిన తర్వాత ముద్దగా మారేదని, ఈ అన్నం అలా కాలేదని ఇది పొల్లుపొల్లుగా బాగుందని మహిళలు పేర్కొన్నారు. మొదటి నెల కింద పంపిణీ చేసిన సన్నబియ్యంపై జిల్లా పౌరసరఫరా ల అధికారి హ రీ్‌షని ‘ఆంధ్రజ్యోతి’ సం ప్రదించగా, వానాకాలం కొనుగోలుచేసిన సన్నధాన్యానికి సంబంధించి సీఎంఆర్‌ కింద మిల్లుల ద్వారా వచ్చిన బియ్యా న్నే పంపిణీ చేశామని, పూర్తినాణ్యత కలిగిన పోర్టిఫైడ్‌ చేసిన బియ్యమే అన్ని రేషన్‌దుకాణాలకు సరఫరా చేశామని వెల్లడించారు.

రేషన్‌దుకాణాల వద్ద రద్దీ

రేషన్‌దుకాణాల ద్వారా సన్నబియ్యం ఇస్తుండడంతో మంగళవారం సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని రేషన్‌దుకాణాల వద్ద రద్దీ కొనసాగింది. గతంలో రేషన్‌ తీసుకోవడానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనివారంతా ఈసారి దుకాణాల వద్ద క్యూకట్టారు. దీంతో ఒక్కొక్కరు రేషన్‌ బియ్యం పొందేందుకు దాదాపు గంటన్నర నుంచి రెండుగంటల సమయం వేచిఉండాల్సి వచ్చిందని చెప్పారు. మొత్తంగా ఇలాగే సన్నబియ్యం కొనసాగిస్తే ఈ బియ్యమే తింటామని పలువురు లబ్ధిదారులు తెలిపారు.

అన్నం బాగుంది : పెండెం పద్మ, సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి

మేం కూలి పనులు చేసుకొని జీవిస్తాం. మాకు రేషన్‌కార్డు కింద గతంలో దొడ్డుబియ్యం వచ్చేవి. వాటిని వండుకున్నప్పుడు వేడిగా ఉన్నప్పుడే తినేవాళ్లం. చల్లారాక ముద్దగా అయ్యేది. మధ్యాహ్ననికి తినలేకపోయేవాళ్లం. దీంతో రాత్రి మాత్రమే దొడ్డుబియ్యం వండుకునేవాళ్లం. ఉదయం, మధ్యాహ్నానానికి రేటు ఎక్కువైనా దుకాణాల్లో సన్నబియ్యం కొనుక్కొనేవాళ్లం. ఇప్పుడు సన్నబియ్యమే రేషన్‌కింద రావడం చాలా సంతోషాన్ని కలిగించింది.

ఎన్నడూ లేనంత సంతోషంగా ఉంది: ఆకారపు జ్యోతి, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి గ్రామం

మాలాంటి పేద కుటుంబాలకు సన్నబియ్యం అన్నం రోజూ తినే అదృష్టం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు. రేషన్‌షాపువద్ద గతంలో బియ్యం కోసం వెళితే, నిమిషాల్లో ఇచ్చేవారు. ఎవరూ తీసుకోకపోవడంతో తీసుకునేవాళ్లకి వెంటనే ఇచ్చేవాళ్లు. ఈ రోజు రేషన్‌షాపు వద్ద కిక్కిరిసిఉంది. బియ్యం తీసుకోవడానికి దాదాపు రెండు గంటలు పట్టింది. మేం తీసుకున్న బియ్యం బాగున్నాయి. అన్నం చాలా బాగా అయింది. మాకు బియ్యం కొనే బాధ తప్పింది.

సన్నబియ్యం అన్నం బాగుంది: గడ్డం సైదమ్మ, జి.యడవల్లి, నల్లగొండ జిల్లా

మాకు రేషన్‌బియ్యం కింద సన్నబియ్యం వచ్చాయి. మేం వ్యవసాయ కూలీలం. మాకు రేషన్‌కింద ఇచ్చిన బియ్యంతో అన్నం బాగా అయింది. మేం గతంలో మార్కెట్లో కొనే సన్నబియ్యం అన్నంలాగానే ఉంది. ప్రభుత్వమే ఉచితంగా సన్నబియ్యం ఇస్తుండడంతో మాలాంటి పేదకుటుంబాలకు బియ్యం ఖర్చు తగ్గుతుంది. మాకు బియ్యం అందించిన సీఎంకి, మంత్రి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు. ఒకటి, రెండు నెలలు ఇచ్చి ఆపకుండా కొనసాగించాలని కోరుతున్నాం.

Updated Date - Apr 03 , 2025 | 12:40 AM