Share News

నేడు బార్‌ అసోసియేషన ఎన్నికలు

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:22 AM

భువనగిరి బార్‌ అసోసియేషన ఎన్నికల పోలింగ్‌ నేడు జరగనుంది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిల స్థానాలకు ఇద్దరేసి అభ్యర్థుల చొప్పున పోటీ పడుతున్నారు.

నేడు  బార్‌ అసోసియేషన ఎన్నికలు

భువనగిరి టౌన, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): భువనగిరి బార్‌ అసోసియేషన ఎన్నికల పోలింగ్‌ నేడు జరగనుంది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిల స్థానాలకు ఇద్దరేసి అభ్యర్థుల చొప్పున పోటీ పడుతున్నారు. ఈపాటికే ఆరు స్థానాలు ఏకగ్రీవంగా కాగా క్రీడల కార్యదర్శికి నామినేషన్లు రాలేదు. అధ్యక్ష స్థానానికి నిసంగి విద్యాసాగర్‌, వల్లందాసు వెంకటయ్యగౌడ్‌, ప్రధాన కార్యదర్శి స్థానానికి మేడ బోయిన యాదగిరి, బొల్లేపల్లి కుమార్‌ పోటీ పడుతున్నారు. శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్‌, సాయంత్రం 4 గంటల నుంచి ఓట్లు లెక్కిం చి ఫలితాల ప్రకటిస్తారు. 136 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బార్‌ కౌన్సిల్‌ నిబంధనల ప్రకా రం ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారి జిట్టా భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఉపాధ్యక్షులుగా వై రేణుక, కోశాధికారిగా ముద్దసాని చంద్రశేఖర్‌రెడ్డి, సహాయ కార్యదర్శిగా సీహెచ అయిలయ్య, గ్రంథాలయ కార్యదర్శిగా సామ రాజేందర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యునిగా కె రాకేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated Date - Apr 04 , 2025 | 12:23 AM