కార్యకర్తల కృషితోనే కేంద్రంలో అధికారం
ABN , Publish Date - Apr 06 , 2025 | 11:35 PM
కార్యకర్తల కృషి వల్లే కేంద్రంలో మూడు సార్లు న రేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ మూడు సార్లు అధికారింలో కొనసాగుతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేములనరేందర్‌రావు అన్నారు.

- బీజేపీ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు
కందనూలు, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి) : కార్యకర్తల కృషి వల్లే కేంద్రంలో మూడు సార్లు న రేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ మూడు సార్లు అధికారింలో కొనసాగుతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేములనరేందర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం భా రతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షు డు పార్టీ జెండావిష్కరణ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నేటికీ 46 సంవత్సరా లు పూర్తి చేసుకుందని తెలిపారు. ఎంతో మంది పార్టీ కోసం, సిద్ధాంతం కోసం తమ జీవితాలను ఫణంగా పెట్టి పని చేయడం వలన దేశంలో నరేంద్రమోదీ నేతృత్వంలో మూడవసారి అధికా రంలో ఉన్నామని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ కొల్లాపూర్ పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కేతూరి నారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సందు రమేష్, రాష్ట్ర నాయకులు తమటం శేఖర్ గౌడ్ కొల్లాపూర్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ధనుంజయ్ గౌడ్, సాయి కృష్ణ గౌడ్, కడతల కృష్ణ, కల్పనరెడ్డి, భాస్కర్‌గౌడ్, గడ్డం శ్రీరామ్, పిన్నం శెట్టి శివ, మహేష్, బొ మ్మరిల్లు భాస్కర్, పర మేష్, శివకృష్ణ, మద్దిలేటి, నవీన్, శ్రీనివాస్‌రావు, బాలపీర్, రాజు, ఇమ్రాన్ పాల్గొన్నారు.
ఫ అచ్చంపేటటౌన్ : పట్టణంలోని బస్టాండ్ సమీపంలో బీజేపీ జెండాను పార్టీ పట్టణ అధ్య క్షుడు గుండు శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. ఆ యన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంగ్య నాయ క్, నాయకులు మండికారి బాలాజీ, రేణయ్య, సై దులు యాదవ్, శ్రీను నాయక్, రాంచంద్రయ్య, రవీందర్, గోలి రేణయ్య పాల్గొన్నారు.
ఫ ఊర్కొండ : మండల కేంద్రంతో పాటు రేవల్లి గ్రామంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పార్టీ జెండాను ఆవిష్కరిం చారు. నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, పరశురాములు, వెంకట్ ఉన్నారు.
ఫ వెల్దండ : బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జెండాను మండలశాఖ అధ్యక్షుడు కుర్మిద్ద యాదగిరి ఆవిష్కరించారు.కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు యెన్నం శేఖర్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, నాయకులు జంగయ్య యాదవ్, గుద్దటి రామస్వామి, తంబాలు, విష్ణు, కృష్ణారెడ్డి, శ్రీశైలం, శ్రీనివాస్‌రెడ్డి, కొండల్, యాదగిరి, కుమార్, రమేష్, రమేష్, గెల్వయ్య, అనిల్ ఉన్నారు.
ఫ అమ్రాబాద్‌లో అంబేఢ్కర్ కూడలి వద్ద బీజేపీ పతాకాన్ని ఆవిష్కరించారు. మిఠాయిలు పంపిణీ చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు, బీజేపీ మండల నాయకు లు, విభాగాల నాయకులు పాల్గొన్నారు.