Share News

Madhapur: పటిష్ట భద్రతకు ప్రైవేట్‌ సంస్థలు సహకరించాలి..

ABN , Publish Date - Feb 07 , 2025 | 08:56 AM

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌(Cyberabad Police Commissionerate) పరిధిలో పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టేందుకు ప్రైవేట్‌ సంస్థలు తమతో కలిసి పనిచేయాలని మాదాపూర్‌ డీసీపీ జి.వినీత్‌(Madhapur DCP G. Vineeth) అన్నారు.

Madhapur: పటిష్ట భద్రతకు ప్రైవేట్‌ సంస్థలు సహకరించాలి..

  • మాదాపూర్‌ డీసీపీ జి.వినీత్‌

హైదరాబాద్‌ సిటీ: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌(Cyberabad Police Commissionerate) పరిధిలో పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టేందుకు ప్రైవేట్‌ సంస్థలు తమతో కలిసి పనిచేయాలని మాదాపూర్‌ డీసీపీ జి.వినీత్‌(Madhapur DCP G. Vineeth) అన్నారు. గురవారం సైబరాబాద్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ప్రైవేట్‌ వ్యాపార సంస్థలైన పబ్స్‌, బార్స్‌, రెస్టారెంట్లు, హోటల్స్‌, లాడ్జ్‌ల నిర్వాహకులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: డ్రగ్స్‌ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్‌.. రూ.5లక్షల విలువగల కొకైన్‌ స్వాధీనం


ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడుతూ.. ప్రజల భద్రతా నేపథ్యంలో వ్యాపార సంస్థలు భద్రతా చర్యలకు పెద్దపీట వేయాలని, ఈవిషయంలో సైబరాబాద్‌(Cyberabad) పోలీసులకు సహకరించాలన్నారు. ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలు ఎంతో కీలకమని, చట్టపరంగా నిబంధనలను పాటిస్తూ ఆయా ప్రైవేట్‌ సంస్థల వద్ద భద్రత సమర్థవంతంగా ఉండేలా చూడాలని ప్రైవేట్‌ సంస్థల నిర్వాహకులకు సూచించారు. ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలు గుర్తింపు పొందినవై ఉండాలని, వారికి సంబంధించిన అనుమతి వివరాలను తెలుసుకొన్న తర్వాతే సెక్యూరిటీ గార్డులను విధుల్లో పెట్టుకోవాలన్నారు.


సెక్యూరిటీ ఏజెన్సీ తరపున ఉండే భద్రతా సిబ్బంది ధరించే దుస్తులు నిబంధనలకు లోబడి ఉండేలా చూసుకోవాలన్నారు. ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని వివిధ ప్రాంతాల్లో ఉండే సెక్యూరిటీ సిబ్బందితో తరచూ తనిఖీలు చేస్తూ భద్రత విషయంపై కచ్చితంగా వ్యవహరించేలా వారికి శిక్షణనివ్వాలని డీసీపీ వివరించారు. ప్రైవేట్‌ వ్యాపార సంస్థలను ప్రభుత్వం అనుమతించిన సమయాలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు.


అక్కడికి వస్తున్న వారికి భద్రత కల్పించడంతో పాటు అనుమానస్పదంగా ఏది కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలు, ఈవెంట్‌ మేనేజర్లు శాంతిభద్రతల కోసం పనిచేస్తున్న పోలీసులకు సహకరించాలని సూచించారు. సమావేశంలో మాదాపూర్‌ ఏడీసీపీ జయరాం, ఏసీపీ సీహెచ్‌. శ్రీకాంత్‌, మాదాపూర్‌ జోన్‌ శాంతి భద్రత విభాగం ఇన్‌స్పెక్టర్లు, వివిధ వ్యాపార సంస్థల నిర్వాహకులు, సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకులు, ఈవెంట్‌ మేనేజర్లు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Mettuguda: ఇంట్లో తల్లి, తనయుడికి కత్తిపోట్లు

ఈవార్తను కూడా చదవండి: Peddapalli: మొదట పరిషత్‌ ఎన్నికలకే మొగ్గు

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర

ఈవార్తను కూడా చదవండి: బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 07 , 2025 | 08:56 AM