పరిగిలో పట్టపగలే చోరీ
ABN , Publish Date - Jan 28 , 2025 | 12:30 AM
పరిగి పట్టణంలో పట్టపగలే చోరీ జరిగింది. మునిసిపల్ పరిధిలోని శాంతినగర్‌కాలనికి చెందిన దోమ సత్తయ్య దంపతులు సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి బంధువుల దగ్గరకు వెళ్లారు.

6 తులాల బంగారం అపహరణ
పరిగి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): పరిగి పట్టణంలో పట్టపగలే చోరీ జరిగింది. మునిసిపల్ పరిధిలోని శాంతినగర్‌కాలనికి చెందిన దోమ సత్తయ్య దంపతులు సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి బంధువుల దగ్గరకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటి తాళం విరగ్గొటి ఉండడాన్ని గమనించిన పక్కంటివారు సత్తయ్యకు సమాచారం ఇచ్చారు. సత్తయ్య దంపతులు ఇంటికి వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం విరగ్గొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న బీరువా తాళం విరగ్గొట్టి అందులో ఉన్న ఆరు తులాల బంగారు అభరణాలను తీసుకెళ్లారు. పక్క బాక్స్‌లో నగదు ఉన్నప్పటికీ ముట్టలేదు. దొంగతనంపై సత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిగి ఎస్‌ఐ సంతోష్ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.