Seethakka: నాగేశ్వర్‌రావు ఆత్మహత్యాయత్నం వెనుక కుట్ర
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:37 AM
అతనికి మద్యం తాగించి ఆత్మహత్యకు ప్రేరేపించారన్నారు. ములుగు జిల్లాలో కొత్తగా ఏర్పడిన మల్లంపల్లి మండలాన్ని సహచర మంత్రి కొండా సురేఖ, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్‌తో కలిసి శుక్రవారం ఆమె ప్రారంభించారు.

ఆయన భార్యకు నేనే ఉద్యోగం ఇప్పించా: మంత్రి సీతక్క
హైదరాబాద్/ములుగు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో గురువారం జరిగిన గ్రామసభలో కుమ్మరి నాగేశ్వర్‌రావు అనే వ్యక్తి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం వెనుక బీఆర్‌ఎస్ నాయకుల కుట్ర ఉందని మంత్రి సీతక్క ఆరోపించారు. అతనికి మద్యం తాగించి ఆత్మహత్యకు ప్రేరేపించారన్నారు.
ములుగు జిల్లాలో కొత్తగా ఏర్పడిన మల్లంపల్లి మండలాన్ని సహచర మంత్రి కొండా సురేఖ, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్‌తో కలిసి శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాగేశ్వర్‌రావు భార్యకు తానే అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగం ఇప్పించానని, ఆ కుటుంబానికి నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు. ఇల్లు లేని నిరుపేదలకే తొలి ప్రాధాన్యంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..
Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం