Share News

గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:44 PM

గిరిజన గూడలలో నివాసం ఉంటున్న ఆదివాసి గిరిజనుల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్క రించాలని సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్‌కే అబ్దుల్‌ అంబటి లక్ష్మణ్‌ లు డిమాండ్‌ చేశారు.

గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి

దండేపల్లి,మార్చి 30 (ఆంధ్రజ్యోతి): గిరిజన గూడలలో నివాసం ఉంటున్న ఆదివాసి గిరిజనుల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్క రించాలని సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్‌కే అబ్దుల్‌ అంబటి లక్ష్మణ్‌ లు డిమాండ్‌ చేశారు. మండలంలోని రాజుగూడలో ఆదివారం ఆది వాసి గిరిజనులతో సమావేశం నిర్వహించి గ్రామంలోని నెలకొన్న సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ గిరిజనులకు ఇం దిరమ్మ ఇండ్లు లేక పూరిగుడెలలో నివాసం ఉంటు కాలం వెల్ల దీస్తు న్నారు. వారికి సరైన ఇంటి స్ధలాలు లేక అనేక ఇబ్బందులు పడు తున్నారు. అర్హులైన గిరినులకు రేషన్‌కార్డు లేకపోవడంతో సంక్షేమ పథ కాలు అందడం లేదన్నారు. గ్రామాలోని సరైన రోడ్డు సౌకర్యాలు, డ్రైనేజీ వ్యవస్ధ సరిగా లేవన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి గిరిజన గూడలల్లో మౌలిక వసతులు కల్పించి ఆదివాసి గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం నాయకులు కట్నాక సుజాత, కొమరం లక్ష్మి, కోట్నాక జలపతి, కనక దాపారావు, గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 11:44 PM