Share News

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:29 PM

జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పార్టీ కార్యలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి రఘునాఽథ్‌ వెరబెల్లి పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
మంచిర్యాలలో పార్టీ జెండా ఎగురవేస్తున్న బీజేపీ నాయకులు

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పార్టీ కార్యలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి రఘునాఽథ్‌ వెరబెల్లి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తోం దని తెలిపారు. నాయకులు దుర్గం అశోక్‌, ముకేష్‌గౌడ్‌, వెంకటకృష్ణ, కృష్ణమూర్తి, రాజ్‌కుమార్‌, కర్రె లచ్చన్న, మల్లికార్జున్‌, మురళీ, దుర్గా ప్రసాద్‌, శివ, రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి (ఆంధ్రజ్యోతి): మండలంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, నాయకులు హేమాజీ, రాచర్ల సంతోష్‌, కళ్యాణి, పాల్గొన్నారు.

చెన్నూరు (ఆంధ్రజ్యోతి): పట్టణంలో జరిగిన వేడుకల్లో బీజేపీ పట్టణ అద్యక్షుడు జాడి తిరుపతి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు బత్తుల సమ్మయ్య, వేడుకల కన్వీనర్‌ శ్రీనివాస్‌రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీపాల్‌, నాయకులు రాజేశ్వర్‌,మాణిక్‌, శంకర్‌, రాజు, దుర్గా ప్రసాద్‌, మదు, మహేష్‌, సతీష్‌, సాయికుమార్‌, వెంకట్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

దండేపల్లి (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జరిగిన కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఎంబడి సురేందర్‌, కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు వనపర్తి రాకేష్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ పత్తిపాక సంతోష్‌, నాయకులు మల్లూరి భూమన్న, గోళ్ల మల్లేష్‌, చీర్ల వెంకటేశ్వర్లు, సర్గం శంకరయ్య, రామస్వామి, ఈశ్వర్‌, భూమేష్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

నెన్నెల (ఆంధ్రజ్యోతి): మండలంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు అంగలి శేఖర్‌, నాయకులు అద్దరపల్లి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

కాసిపేట (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో జరిగిన వేడుకల్లో బీజేపీ మండల అధ్యక్షుడు సూరం సంపత్‌, నాయకులు రెడ్డి బాలరాజు, పెద్దపల్లి శంకర్‌, దోమల రాంచందర్‌, సదయ్య, పోశం, సురేందర్‌, విష్ణువర్దన్‌, రంజిత్‌, సాయి, అనిల్‌ పాల్గొన్నారు.

వేమనపల్లి (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ మండల అద్యక్షుడు ఏట మధుకర్‌, మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌, నాయకులు అజయ్‌కుమార్‌, స్వామి, మధునయ్య, లస్మయ్య , కిశోర్‌, చరణ్‌రాజ్‌, సతీష్‌, మధునయ్య, పోచన్న, కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

లక్షెట్టిపేట(ఆంధ్రజ్యోతి): మండలంలో జరిగిన కార్యక్రమాల్లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు హరిగోపాల్‌రావు, మండల అధ్యక్షుడు హేమంత్‌రెడ్డి, నాయకులు రమేష్‌ చంద్‌, నరేష్‌ చంద్‌, తమ్మినిడి శ్రీనివాస్‌, వెంకటర మణ, పాంచాల రమేష్‌ పాల్గొన్నారు.

మందమర్రిరూరల్‌ (ఆంధ్రజ్యోతి): మండలంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా జాయింట్‌ కన్వీనర్‌ దేవరనేని సంజీరావు, మండల అధ్యక్షుడు జనార్దన్‌, మాజీ ఉపసర్పంచు కర్రె రాజయ్య పాల్గొన్నారు.

భీమిని (ఆంధ్రజ్యోతి): మండలంలో జరిగిన వేడుకల్లో బీజేపీ మండల అధ్యక్షుడు కొంక సత్యనారాయణ , బూత్‌ అధ్యక్షులు బత్తిని రమేష్‌ గౌడ్‌, ఇప్పకాయల వెంకటేష్‌, కొంక శ్రీనివాస్‌, ఇందూరి శ్రీధర్‌, పొల్క వెంకటేష్‌, సంగర్స్‌ బాలకిషన్‌ రావు పాల్గొన్నారు.

తాండూర్‌ (ఆంధ్రజ్యోతి): మండలంలోని అచ్చలాపూర్‌లో జరిగిన వేడుకల్లో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు సుధీర్‌గౌడ్‌, నాయకులు సతీష్‌, హరీష్‌, జనార్దన్‌, విజయ్‌కుమార్‌, మహేష్‌, సాయిరాం, రమేష్‌, అరుణ్‌, రవితేజ, వెంకటేష్‌, సంతోష్‌, ఉపేందర్‌, వంశీ, వెంకటేష్‌, భాను ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

రామకృష్ణాపూర్‌ (ఆంధ్రజ్యోతి): పట్టణంలో జరిగిన కార్యక్రమంలో సెంట్రల్‌ ఫిల్మ్‌బోర్డు మెంబర్‌ ఆరుముల్ల పోచం, నాయకులు ఠాకూర్‌ ధన్‌సింగ్‌, బంగారు వేణుగోపాల్‌, వేముల అశోక్‌, కె కిషోర్‌, కళాధర్‌ రెడ్డి, కట్ట ఈశ్వరాచారి, సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు.

మందమర్రిటౌన్‌ (ఆంధ్రజ్యోతి): పట్టణంలో జరిగిన కార్యక్రమంలో డీవీ దీక్షితులు, నరేష్‌, శ్రీనివాస్‌, రాయ మల్లు, సంజీవరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2025 | 11:29 PM