Share News

Uttam Kumar Reddy: ఉప ఎన్నిక వచ్చినప్పుడే రేషన్‌ కార్డులిచ్చారు

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:07 AM

గత పాలకులు ఉప ఎన్నికలు వచ్చినప్పుడే తెల్ల రేషన్‌ కార్డులు ఇచ్చారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ తన పదేళ్ల పాలనలో పేదలకు అన్యాయం చేసిందన్నారు.

Uttam Kumar Reddy: ఉప ఎన్నిక వచ్చినప్పుడే రేషన్‌ కార్డులిచ్చారు

  • గత పాలకులతో పేదలకు అన్యాయం

  • ఉగాది నుంచి పేదలకు సన్న బియ్యం

  • కార్డు లేకున్నా అర్హుల్లో పేరుంటే చాలు

  • త్వరలో మరికొన్ని వస్తువులు: ఉత్తమ్‌

హైదరాబాద్‌, మార్చి 26(ఆంధ్రజ్యోతి): గత పాలకులు ఉప ఎన్నికలు వచ్చినప్పుడే తెల్ల రేషన్‌ కార్డులు ఇచ్చారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ తన పదేళ్ల పాలనలో పేదలకు అన్యాయం చేసిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక పౌర సరఫరాల శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, 30 లక్షల కార్డులు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. బుధవారం శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్‌ సమాధానం ఇచ్చారు. రేషన్‌ దుకాణాల్లో బియ్యంతో పాటు త్వరలో మరికొన్ని వస్తువులు కూడా అందించనున్నామని తెలిపారు. ఉగాది నుంచి ప్రారంభించబోయే సన్న బియ్యం పంపిణీని రేషన్‌ కార్డు లేని వారికి కూడా ఇస్తామని చెప్పారు. కార్డు లేకపోయినా ప్రభుత్వం ఎంపిక చేసిన అర్హుల జాబితాలో పేరు ఉంటే సరిపోతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ ప్రాంతం వారైనా ఎక్కడి నుంచైనా రేషన్‌ షాపుల్లో వస్తువులు తీసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. దేశంలో ఆహార భద్రత పథకం కింద సన్నబియ్యాన్ని అందించే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. పదేళ్లగా దేవాదుల ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. తమ ప్రభుత్వం దానిపై దృష్టి సారించిందని, రెండ్రోజుల్లో కొన్ని పంపులను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.


ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంఽధించి పలు అంశాలపై అధ్యయనం చేస్తున్నామని, అవి పూర్తవ్వగానే పనులు ప్రారంభిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్‌ నివేదిక వచ్చిందని, న్యాయ విచారణ కమిషన్‌ నివేదిక, నేషనల్‌ డ్యామ్‌ సేప్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) నుంచి నివేదిక రావాల్సి ఉందన్నారు. ఎన్‌డీఎ్‌సఏ నుంచి ప్రాథమికంగా తెలిసిన వివరాల ప్రకారం ముందు సమగ్ర ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్న నిర్మాణ శైలికి, ఆ తరువాత చేపట్టిన నిర్మాణ శైలికి మార్పులు ఉన్నట్టు తెలిసిందన్నారు. పూర్తి నివేదిక వచ్చాక అన్ని వివరాలు సమగ్రంగా తేలతాయని, తప్పులు ఎవరు చేశారన్నది తేలితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చాలని సీడబ్ల్యూసీ ఎలాంటి లేఖా ఇవ్వలేదన్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీ్‌షబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైందన్నారు. గ్రామాల్లో అప్పులు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో 15 నెలల్లో 24 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నట్లు తెలిస్తే తామే ముందుండి పోరాడతామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..

GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 27 , 2025 | 04:07 AM