Share News

Onion Powder: ఇంట్లోనే ఉల్లిపాయతో ఈ నిల్వ పొడి తయారుచేస్తే.. ఎప్పుడైనా, ఏ కూరలోనైనా వాడుకోవచ్చు..

ABN , Publish Date - Mar 20 , 2025 | 01:15 PM

Onion Powder Recipe: ఏ వంట చేసినా ఒక్క ఉల్లిపాయ అయినా వేసి తీరాల్సిందే. ఇది లేకుండా వంట చేసినా అంత రుచి రాదు. ప్రతి ఒక్కరూ కూరల్లో తప్పనిసరిగా వాడుకునే ఉల్లిపాయను అప్పటికప్పుడు కోసుకోవాల్సిందే. పని తగ్గుతుందని ఒక రోజు ముందే తరిగిపెట్టుకున్నా రుచి అంత బాగుండదు. కానీ, ఈ నిల్వ పొడిని ఇంట్లో తయారుచేసుకుంటే ఏ కూరలోకి అయినా వాడుకోవచ్చు. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది.

Onion Powder: ఇంట్లోనే ఉల్లిపాయతో ఈ  నిల్వ పొడి తయారుచేస్తే.. ఎప్పుడైనా, ఏ కూరలోనైనా వాడుకోవచ్చు..
Onions Powder Recipe

Onion Powder Recipe At Home: ఏ వంటకం చేసినా అందులో ఉల్లిపాయ తప్పకుండా ఉండాల్సిందే. కనీసం ఒక్కటైనా వేయకముందే వంట పూర్తవదు. కూరల రుచిని రెట్టింపు చేసే ఉల్లిపాయ ధర మార్కెట్లో ఎప్పుడూ ఒకేలా ఉండదనే సంగతి తెలిసిందే. కోసేటప్పుడు ఒక్కటే కాదు.. ధరకు రెక్కలొచ్చి ఆకాశాన్ని తాకినప్పుడు కన్నీళ్లు తెప్పిస్తుంది. ప్రతి ఏడాదిలో కొన్ని సీజన్లలో అత్యధిత ధర పలికితే.. మరి కొన్ని నెలల్లో స్వల్ప ధరకే లభ్యమవుతుంది. అందుకే ధర తక్కువగా ఉన్నప్పుడు ఈ పొడి తయారుచేసుకుంటే అధిక ధరలు ఉన్నప్పుడు అవసరానికి పనికొస్తుంది. అదే విధంగా హడావుడిగా వంట కోసం అప్పటికప్పుడు ఉల్లిపాయ కోసే బాధా తప్పుతుంది. మరి, రుచి ఎలా ఉంటుందో అని కంగారుపడుతున్నారేమో. ఆ భయమే అక్కర్లేదు. కూరలు, పప్పులు, పులుసులు ఎందులో వేసుకున్నా తాజా ఉల్లిపాయ వేసినట్టే సేమ్ టేస్ట్ వస్తుంది. ఇంట్లోనే ఉల్లిపాయ నిల్వపొడిని తయారుచేసుకునే విధానం తెలుసుకుందామా.


ఉల్లిపాయ నిల్వపొడి తయారీ విధానం :

  • ఉల్లిపాయ నిల్వ పొడి తయారుచేసుకోవడానికి ముందుగా తాజాగా ఉన్న కొన్ని ఉల్లిపాయల్ని తీసుకోండి. ఎరుపు, తెలుపు లేదా ఏ రకమైనా ఎంచుకోవచ్చు.

  • ఇప్పుడు ఉల్లిపాయలు సగానికి కట్ చేసి పైన ఉన్న తొక్క శుభ్రంగా తీయండి. తర్వాత వీటిని సన్నగా తరిగాక ఎండలో బాగా ఎండబెట్టాలి. తర్వాత పొడి చేసుకోవచ్చు.

  • ఒకవేళ మీకు ఎండలేకపోతే ఒక కడాయి తీసుకుని మీడియం మంటపైన ఉల్లిపాయలను తడిపోయేవరకూ వేయించండి. మాడిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒక వేళ మాడిన ముక్కలు కనిపిస్తే వాటిని పక్కకు తీసేశాకే మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. లేకపోతే రుచి అంత బాగుండదు. వేయించిన ఉల్లిముక్కలను వేడి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో నిల్వచేసుకోండి.


  • ఓవెన్ ద్వారా కూడా డీ హైడ్రేట్ చేసుకోవచ్చు. ఒక ట్రేలో వీటిని సింగిల్ లేయర్‌గా తీసుకుని 135°F లేదా 57°C వద్ద డ్రై చేయండి. ఇందుకు 8 లేదా 12 గంటల సమయం పడుతుంది.

  • ఖాళీగా ఉన్న సమయాల్లో ఈ ఉల్లిపాయ పొడిని తయారుచేసుకుంటే శ్రమ పడకుండా అప్పటికప్పుడు ఏ కూరలో అయినా వాడుకోవచ్చు. ఈ పొడి సుమారు నెలపైనే నిల్వ ఉంటుంది. బిజీగా ఉన్నప్పుడు సులభంగా వంట చేసుకునేందుకు ఈ ఆనియన్ పౌడర్ ఎంతగానో పనికొస్తుంది. మరి ఆలస్యమెందుకు. ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోగలిగే ఆనియన్ పౌడర్ వెంటనే తయారుచేసుకోండి.


Read Also : Tomato Powder: టమాటా పొడి ఇలా తయారుచేసుకోండి.. ఏ కూరలో వేసినా టేస్ట్‌ అదిరిపోతుంది..

Magic Masala Recipe : నిమిషాల్లో తయారయ్యే మ్యాజిక్ మసాలా.. ఏ రెసిపీ అయినా టేస్ట్ అదిరిపోద్ది..

మామిడిముక్కలతో చేపల పులుసు

Updated Date - Mar 20 , 2025 | 01:24 PM