గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో తిరుమలలో కోట్లాది రూపాయల తులా భారం కానుకలను స్వాహా చేశారని, తులా భారంలో అక్రమాలు జరిగినట్లు విజిలేన్స్ నివేదిక ఇస్తే..అధికారులు తాత్కాలిక ఉద్యోగులను తొలగించి మిన్నకుండిపోయారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
శబరిమల ఆలయంలో పూజించే అయ్యప్ప స్వామి చిత్రం ఉన్న బంగారు లాకెట్ల పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మణిరత్నం అనే వ్యక్తి తొలి గోల్డ్ లాకెట్ దక్కించుకున్నారు. ఈ మేరకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ఆయనకు బంగారు లాకెట్ను అందజేశారు.
ఏపీలో రాజ్యసభ స్థానానికి సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఎంపీగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే..
రాష్ట్రంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులు బుధవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు పర్యటించనున్నారు. ఈ బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అనేక అంశాలపై ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత విజయవాడలో వివిధ పార్టీల ప్రతినిధులతో ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడతారు.
గ్రామీణాభివృద్ధిశాఖలో పనిచేస్తున్న ఉపాధి సిబ్బందికి పదోన్నతుల కోసం చర్యలు ప్రారంభించారు. సీనియారిటీ జాబితా రూపొందించి పదోన్నతులు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు
రాష్ట్రంలో మరో ప్రైవేటు హోమియోపతి కాలేజీ ఏర్పాటు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో కొత్త కాలేజీని ప్రభుత్వం అనుమతించింది
తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ తుది దశకు చేరుకుంది. వచ్చే నెలలో నివేదిక అందించడానికి కమిషన్ సిద్ధంగా ఉంది
గుంటూరులోని క్రషర్ యూనిట్లపై మైనింగ్ డాన్ అజయ్ దందా విస్తరించేందుకు యత్నించినా, వ్యాపారుల అప్రమత్తతతో ఆ పన్నాగం విఫలమైంది. విజిలెన్స్ బెదిరింపులతో ఒత్తిడి తెచ్చినా, వ్యాపారులు అజయ్ కుట్రను గుర్తించి ఎదురు నిలిచారు.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆరు నెలల్లో పునరావాసం పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది చింతూరు, కేఆర్పురం ప్రాంతాల్లో 48 గ్రామాలకు R&R ముసాయిదా మేలో సిద్ధం కానుంది
రాజమండ్రిలోని అగ్నిమాపక కేంద్రం భాషా ప్రేమను చాటుతూ ప్రతి పదాన్నీ అచ్చతెలుగులో అందించింది. చిచ్చు గోళ్లు నుంచి మించుమొన వరకు నూతన పదప్రయోగాలతో భాషాభిమానులను ఆకట్టుకుంది