Home » 2024 Lok Sabha Elections
అరుణాచల్ ప్రదేశ్‌లో కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ ఇక్కడ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మరోవైపు సిక్కింలో.. సిక్కిం క్రాంతి మోర్చా(ఎ్‌సకేఎం) రెండోసారి అధికారాన్ని చేపట్టనుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏప్రిల్ 19 ఎన్నికలు జరగ్గా.. లోక్‌సభతోపాటు ఫలితాలను ఈ నెల 4న ప్రకటించాల్సి ఉంది.
ప్రధాని మోదీ ఆదివారం ఉన్నతాధికారులతో పెద్ద ఎత్తున సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారీ అధికారం బీజేపీదేనంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడడంతో కమలనాథుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.
రాష్ట్రంలో టీడీపీ కూటమి ఘనవిజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనా వేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతోందని ప్రకటించాయి. జాతీయ స్థాయి సర్వే సంస్థల్లో అత్యధికం.. కూటమి వైపే మొగ్గు చూపించాయి.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. జూన్ 1వ తేదీన సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయి. మూడోసారి కూడా..
మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. లోక్ సభ ఏడో దశ పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. సరిగ్గా 6.30 గంటలకు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడి అవుతాయి. దేశంలో లోక్ సభ పోలింగ్ ఏడు దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రంతో చివరి దశ పోలింగ్ ముగియనుంది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి.
కడప లోక్ సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల బరిలోకి దిగడంతో వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి భయం పట్టుకుంది. ఎక్కడ ఓడిపోతాననే భయంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సంప్రదింపులు జరిపారు. జగన్ ఇలాకా పులివెందులలో అసెంబ్లీకి టీడీపీకి వేస్తాం అని, పార్లమెంట్ స్థానానికి తనకు ఓటు వేయాలని అవినాశ్ రెడ్డి సమాచారం పంపించారని తెలిసింది.
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ దాఖలు చేసిన వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇ
సార్వత్రిక ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ఏడో, ఆఖరి దశకు సంబంధించి శనివారం పోలింగ్ జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ సహా ఈ విడతలో ఏడు రాష్ట్రాల్లోని 57
బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా బహిరంగ సభలు, రోడ్‌షోలు, ర్యాలీలు అన్నీ కలిపి ప్రధాని మోదీ 206 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ 421 సార్లకు పైగా ‘మందిరం-మసీదు’, దేశాన్ని విడదీసే విభజనవాద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.