Share News

నడి రోడ్లపై ట్రాన్స్‌ఫార్మర్లు

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:28 PM

పట్టణంలో ఇరుకైన వీధులు, విస్తారమైన రోడ్లలో కూ డా నడిరోడ్లపై ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసేశారు. నిబంధనల ప్రకారం ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలి. కొందరు ప్రైవేటు భవన యజామనులు నడిరోడ్లపై ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తు న్నారు.

నడి రోడ్లపై ట్రాన్స్‌ఫార్మర్లు
కాల్వపైనే నిర్మించిన ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మె

తక్కువ ఎత్తులో... కాల్వలపై....

రక్షణ కంచెలేని వైనం

ట్రాఫిక్‌కు అడ్డంగా దిమ్మెలు

పర్యవేక్షణ లోపమే

పట్టించుకోని అధికారులు

మదనపల్లె టౌన్‌, మార్చి 22(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఇరుకైన వీధులు, విస్తారమైన రోడ్లలో కూ డా నడిరోడ్లపై ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసేశారు. నిబంధనల ప్రకారం ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలి. కొందరు ప్రైవేటు భవన యజామనులు నడిరోడ్లపై ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తు న్నారు. నిబంధనల ప్రకారం బహుళ అంతస్థుల భవనాలకు కేటాయించిన స్థలాల్లోనే ప్రైవేటు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలి. కానీ యాజమానులు ట్రాన్స్‌ఫార్మర్లను వీధుల్లో, మున్సిపల్‌ స్థలాల్లో తక్కువ ఎత్తులో ఏర్పాటు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.


20MPL-T5.gifసీటీఎం రోడ్డులో తక్కువ ఎత్తులో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌

కొన్ని చోట్ల వీధులను ఆక్రమించి విద్యుత్‌స్థంబాలు, ఏర్పాటు చేయడమే కాక దిమ్మెలపై ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పా టు చేసి ట్రాఫిక్‌కు ఇబ్బందులకు గురిచేస్తున్నా రు. పట్టణంలో బహుళ అంతస్థుల భవనాలు 90 దాకా వున్నాయి. ఇరుకైన వీధుల్లో మున్సిపాలిటీకి సమర్పించే బిల్డింగ్‌ ప్లాన్‌ అప్రూవల్‌ నిబంధనల ను తుంగలో తొక్కుతున్నారు. ప్రైవేటు సంస్థలు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు సొంత స్థలంలోనే నిర్మించాల్సి ఉంది. కానీ కొందరు భవన యజమానులు వారి స్థలాల్లో ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మెలను నిర్మించకుండా ఏకంగా కాల్వలు దాటించి మున్సిపల్‌ స్థలాల్లో ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మెలను నిర్మిస్తున్నారు.


20MPL-T3.gifరోడ్డుపైనే ట్రాఫిక్‌కు అడ్డంగా

ఈ క్రమంలో పట్టణంలో ఏర్పాటు చేస్తు న్న ట్రాన్స్‌ఫార్మర్లతో రోడ్లు మరింత ఇరుకుగా మారి నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. మరికొన్ని చోట్ల తక్కువ ఎత్తులో ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం, వాటి చుట్టూ రక్షణ తీగలు ఏర్పాటు చేయకపోవడంతో అటుగా ప్రజ లు వెళితే విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం వుంది. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల వివరణ ఇస్తూ మున్సిపల్‌ స్థలాల్లో ప్రైవే టు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయకూడదన్నారు. తాము ఎస్పీడీసీఎల్‌ అధికారులు, ఉన్నతాధికారులకు లేఖలు రాస్తామన్నారు. నిబంధనలు అతిక్రమించి మున్సిపల్‌ స్థలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పా టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 11:28 PM

News Hub