క్షయ నివారణకు కృషి చేద్దాం
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:29 PM
క్షయ నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రమేష్‌బాబు పిలుపునిచ్చారు. క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభు త్వాస్పత్రిలో నిర్వహించిన సమావేశంలో టీబీ ముక్త్ భా రత్ పంచాయతీకి ఎన్నికైన యూనిట్ పరిధిలోని మం చూరు, తాటిగుంటపల్లె, కలికిరి మండలం మున్నేళ్లపల్లె, నిమ్మనపల్లె మండలంలో కొండయ్యగారిపల్లె, తవళం పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం టీబీ అంతం మన పంతం నినాదాలతో పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వ హించారు.

క్షయ వ్యాధి నివారణ దినోత్సవం
మార్మోగిన ‘అందరి పంతం టీబీ అంతం’ నినాదం
ర్యాలీలు, ప్రదర్శనలతో మానవహారం
ప్రతిజ్ఞ చేసిన అధికారులు, ప్రజలు
వాల్మీకిపురం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): క్షయ నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రమేష్‌బాబు పిలుపునిచ్చారు. క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభు త్వాస్పత్రిలో నిర్వహించిన సమావేశంలో టీబీ ముక్త్ భా రత్ పంచాయతీకి ఎన్నికైన యూనిట్ పరిధిలోని మం చూరు, తాటిగుంటపల్లె, కలికిరి మండలం మున్నేళ్లపల్లె, నిమ్మనపల్లె మండలంలో కొండయ్యగారిపల్లె, తవళం పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం టీబీ అంతం మన పంతం నినాదాలతో పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వ హించారు. పద్మావతి హెల్త్ సర్వీస్ సొసైటీ ద్వారా క్షయ బాధితులకు పోషకాహారం పంపిణీ చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, స్థానిక డాక్టర్లు సోని, శివాణి, హిమబిందు, రవి, ధాత్రి ఫౌండేషన్ అధ్య క్షురాలు డాక్టర్ స్వాతి చక్రపాణి, పద్మావతి హెల్త్ సర్వీస్ సొసైటీ డాక్టర్ సోమశేఖర్, చరిత, గోవిందమ్మ, సూపర్ వైజర్ నాగిరెడ్డి, సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
వాల్మీకిపురంలో పోషకాహారం అందిస్తున్న డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రమేష్‌బాబు
అందరి పంతం టీబీ అంతం
పీలేరు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): సమాజంలోని ప్రతి ఒక్కరూ టీబీ అంతానికి కృషి చేయాలని పీలేరు ప్రభు త్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పిలు పునిచ్చారు. పీలేరు ప్రభుత్వ ఆస్పత్రి, టీబీ యూనిట్, రేగళ్లు, తలపుల పీహెచ్‌సీల సిబ్బంది క్షయ వ్యాధి నివా రణ దినోత్సవం నిర్వహించారు. టీబీ బాధితులకు ‘డాట్’ సేవలందించిన 25 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలు, మొమెంటోలు బహూకరించారు. అనంతరం పట్టణంలో టీబీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్‌ఎంఓ సరస్వ తమ్మ, డాక్టర్ నాగవేణి, డాక్టర్ కేశవులు, డాక్టర్ కరీము ల్లా, డాక్టర్ చంద్రశేఖర్ నాయక్, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో
మదనపనల్లె అర్బన్, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యవ రం మెడికల్ సెంటర్‌లో మెడికల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో నర్శింగ్ విద్యార్థులతో, ఆరోగ్యవరం సిబ్బంది ర్యాలీ చేపట్టారు. జిల్లా ఆస్పత్రి టీబీ విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్చనబాబు, ఆర్‌ఎంఓ డాక్టర్ సుకు మార్ అధ్యక్షతన ఆరోగ్యవరం నుంచి తురకపల్లె మీదు గా అవగాహన ర్యాలీ చేపట్టారు. ధాత్రి ఫౌండేషన్ వారు 50 మందిని దత్తత తీసుకుని క్షయనుంచి విముక్తి కల్పించినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ స్వాతి తెలిపారు. కార్యక్రమంలో మదనపల్లె టీబీ విభాగ సిబ్బం ది ప్రభాకర్, శాంతి, వనజకుమారి, ఆరోగ్యవరం సిబ్బం ది నెల్సన్, సౌందర్య, క్రిస్టినా, సురేష్, మోసెస్, ఏసుదాస్, నర్శింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
మదనపల్లెలో చేపట్టిన అవగాహన కార్యక్రమం
ములకలచెరువులో...
ములకలచెరువు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ములకలచెరువులో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వాస్పత్రి నుంచి బస్టాండు సర్కిల్ ప్రదర్శన చేపట్టారు. వైద్యాధికారి జాహ్నవి మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు ఉంటే ప్రభుత్వాస్పత్రిలో గళ్ళ పరీక్ష చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశాకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
క్షయ నివారణే లక్ష్యం
తంబళ్లపల్లె, మార్చి 24(ఆంధ్రజ్యోతి): క్షయ నివారణకు ప్రతి ఒక్కరం కృషిచేద్దామని టీబీ సూపర్‌వైజర్ రామకృష్ణనాయుడు అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవంలో భాగంగా స్థానిక ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది ఆస్పత్రి నుంచి వైఎస్సార్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి క్షయ నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వైద్యులు విక్రాంత్‌రెడ్డి, అమరసింహరాజు, సుమలత, ఐసీటీసీ కౌన్సిలర్ చంద్రమోహన్, ఎల్‌టీ గిరి, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.