Home » AP Police
సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు నెల రోజులు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలులో ఉంటుందన్నారు. ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు ..
నటి జెత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీ, కాంతి రాణా టాటా ముగ్గురు అధికారులు ఐపీఎస్ శిక్షణలో ఏం నేర్చుకున్నారో అర్థం కావడం లేదని జీవీ అన్నారు. ఓ ఆడపిల్లను వేధించడం కోసం ఇంత మంది ఐపీఎస్‌లు పని చేయడం దారుణమని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనించాలని, ఏడీజీ స్థాయి నుంచి పోలీసు శాఖలోని ఉన్నత అధికారులపై వేటు వేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
తిరుమల లడ్డూ కల్తీపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని.. ఎలాంటి విచారణకైనా సిద్ధమని కరుణాకర్ రెడ్డి అన్నారు.
పెద్దాపురం, సెప్టెంబరు 22: పెద్దాపురం డీఎస్పీగా డి.శ్రీహరిరాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకూ డీఎస్పీగా పనిచేసిన కె.లతాకుమారి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాలని డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. బాధ్యతలు
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. ఆదిత్య కన్స్ట్రాక్షన్స్ కంపెనీలో సిట్ పోలీసులు ఇవాళ(శనివారం) తనిఖీలు చేశారు. ఆదిత్య కన్స్ట్రాక్షన్స్ కంపెనీ తనను మోసం చేసిందంటూ వాకాడ తిరుమలరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిత్య కన్స్ట్రాక్షన్స్ కంపెనీపై సీసీఎస్‌లో కేసు నమోదైంది.
నెల్లూరు జిల్లాలో సినిమా లెవల్లో చోరీ జరిగింది. కేంద్రపాలిత ప్రాంతం పుద్దుచ్ఛేరికి చెందిన ఓ కుటుంబం జిల్లాలో పొలం కొనుగోలు చేసేందుకు ముత్తుకూరు గ్రామానికి బయలుదేరారు.
నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు కేసులో ఎట్టకేలకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి మూడు నెలలు దాటింది. అయినా పోలీస్ శాఖలో బదిలీల పందేరం సా..గుతూనే ఉంది. డబ్బు కొట్టిన వాళ్లకే సీట్లు దక్కుతున్నాయనే వాదన పెద్ద ఎత్తున వినవస్తోంది. గతంలో పని చేసిన చోట పలు ఆరోపణలు ఎదుర్కొన్న వారు సైతం మళ్లీ అదే స్థానం దక్కించుకోవడం దానికి బలాన్ని చేకూరుస్తోంది. పైగా వైసీపీకి తమ వంతు సాయం చేసిన వాళ్లకూ మంచి పోస్టింగులే వచ్చాయి. వీఆర్, లూప్‌లైన్లలో ఏళ్ల తరబడి చేసిన వా
డీఐజీ అమ్మిరెడ్డిపై రిటైర్డ్ డీఎస్పీ నరసప్ప ఫిర్యాదు చేశారు. మానసికంగా వేధించడంతో పాటు తనను ధూషించిన డీఐజీ అమ్మిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని నరసప్ప అలిపిరి పోలీసు స్టేషన్లో ఈరోజు (సోమవారం) ఫిర్యాదు చేశారు.