Home » Arvind Kejriwal
సీఎం పదవికి కేజ్రీవాల్ (Arvind Kejriwal) మంగళవారం రాజీనామా చేయనున్నారు. నూతన ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఆమ్ ఆద్మీ పార్టీ రేపే ప్రకటన చేయనుంది. ఉదయం11 గంటలకు కేజ్రీవాల్ నివాసంలో ఆప్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది.
నలభై ఎనిమిది గంటల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలుసుకునేందుకు అపాయింట్మెంట్ కోరారు. ఇందుకు ఎల్జీ ఆమోదించినట్టు ఆప్ తెలిపింది.
మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయి.. బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ముఖ్యమంత్రి పదవికి రెండు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు ఆయన ఆదివారం న్యూఢిల్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ వారసులు ఎవరు అనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కేజ్రీవాల్ ప్రకటనపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. ఆదివారం మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్దిలో అన్నా హజారే విలేకర్లతో మాట్లాడారు. రాజకీయాల్లోకి వెళ్లవద్దని కేజ్రీవాల్‌ను హెచ్చరించానని గుర్తు చేసుకున్నారు.
దాదాపు ఆరు నెలల తర్వాత బెయిలుపై బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఆదివారంనాడు జరిపిన పార్టీ సమావేశంలో తన రాజీనామాపై కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల తర్వాత సీఎం పదవికి తాను రాజీనామా చేస్తున్నానని, మళ్లీ ప్రజలు తీర్పు ఇచ్చేవరకూ ఆ కుర్చీలో కూర్చోనని చెప్పారు.
ఇండియా కూటమిలోని రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఆప్‌లు హోరాహోరీ తలపడతాయా? ఆప్‌తో పొత్తు ఇకముందూ కొనసాగుతుందా? అనే ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇచ్చారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో ఆయన వారసులు ఎవరే ఓ చర్చ అయితే వాడి వేడిగా సాగుంది. అలాంటి వేళ ఢిల్లీ మంత్రి అతిషి పేరు కేజ్రీవాల్ వారసురాలిగా తెరపైకి వస్తుంది.
ముఖ్యమంత్రి పదవికి మరో రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం దేశ రాజధానిలో సంచలనం సృష్టించింది.
లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టై జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్.. తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
లిక్కర్ స్కామ్ కేసులో సుమారు అయిదున్నర నేలల పాటు జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు పలు షరతులతో శుక్రవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ కార్యకర్తల సంబరాల మధ్య తీహార్ జైలు నుంచి సాయంత్రం ఆయన విడుదలయ్యారు. కార్యకర్తలకు అభివాదాలు తెలుపుతూనే తన స్పందన తెలియజేశారు.