Delhi Election 2025 Results: ఢిల్లీ ఫలితాల్లో బీజేపీ దూకుడు.. అధికారం దిశగా కమలం పార్టీ
ABN , Publish Date - Feb 08 , 2025 | 09:39 AM
2025 Delhi Legislative Assembly Election: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు చూపిస్తోంది. కౌంటింగ్ మొదట్నుంచి కమలం పార్టీ హవా నడుస్తోంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యేలాగే ఉన్నాయి. ఈసారి బీజేపీదే విక్టరీ అంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రిజల్ట్ డే నాడు అదే రిపీట్ అవుతోంది. ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు షురూ అయింది. కౌంటింగ్ మొదట్నుంచి బీజేపీ హవా నడుస్తోంది. పోస్టల్ బ్యాలెట్‌లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో నిలిచారు. ఇప్పటి వరకు 52 శాతం ఓట్లు దక్కించుకుంది కమలం పార్టీ. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి 43 శాతం ఓట్లు దక్కాయి.
చేతులెత్తేసిన కాంగ్రెస్!
50 స్థానాల్లో గెలుపు దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. ఈ దూకుడు ఆఖరి వరకు కొనసాగితే 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కమలం పార్టీ దక్కించుకోవడం ఖాయమనే చెప్పాలి. ఆప్ గట్టి పోటీ ఇస్తున్నా.. బీజేపీ మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరుత్సాహపర్చింది. హస్తినలో మరోమారు చేతులెత్తేసింది హస్తం పార్టీ. బీజేపీ అధికారం దిశగా అడుగులు వేస్తుండగా.. ఆప్ గట్టి పోటీని ఇస్తోంది. కానీ కాంగ్రెస్ మాత్రం పత్తా లేకుండా పోయింది.
ఇదీ చదవండి:
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. కేజ్రీవాల్‌కు ఊహించని షాక్
ఢిల్లీ పీఠం దక్కాలంటే ఎన్ని సీట్లు గెలవాలి.. 3 పార్టీల ధీమా ఏంటి
ఆప్ నాలుగోసారి గెలుస్తుందా లేదా బీజేపీ కైవసం చేసుకుంటుందా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి