Home » Arvind Kejriwal
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సిబీఐ నమోదు చేసిన కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎలాంటి ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని సెప్టెంబర్ 3న తేదీ వరకూ రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారంనాడు పొడిగించారు.
సీబీఐ నమోదు చేసిన ఎక్సైజ్ పాలసీ కేసులో బెయిలు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి సుప్రీంకోర్టు శుక్రవారం వాయిదా వేసింది. దీంతో బెయిల్ కోసం కేజ్రీవాల్ మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది.
కర్ణాటక గవర్నర్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) కుంభకోణంపై విచారణకు గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆమోదం తెలపడంతో సిద్ధరామయ్య అరెస్ట్ అవుతారా అనే చర్చ జోరుగా సాగుతోంది.
ఈ రోజు ముఖ్యమంత్రి నివాసంలో జాతీయ జెండా ఎగురవేయలేదన్నారు. ఇది చాలా విచారకరమని పేర్కొన్నారు. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని ఈ నియంతృత్వం.. జైల్లో అయితే ఉంచగలిగింది. కానీ హృదయంలో దేశభక్తిని అది ఎలా కలిగి ఉంటుందన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా సునీత కేజ్రీవాల్ స్పందించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు మళ్లీ షాక్ ఎదురైంది. బుధవారం (ఆగస్టు 14) కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ జరుపుతుండగా ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని సెప్టెంబర్ 2వ తేదీ వరకూ ఢిల్లీ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది.
జైలు నిబంధనలకు విరుద్ధంగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆగస్టు 6న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాయడంపై తీహార్ జైలు అధికారులు అభ్యంతరం తెలిపారు.
ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)కి 10 మంది సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కు ఉందని కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదీ కూడా చట్టబద్ద అధికారంగానే ఉందని.. అంతే కానీ ఇది కార్యనిర్వాహక అధికారం మాత్రం కాదని పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీబీఐ అధికారులు సీఎం కేజ్రీవాల్, మరో ఐదుగురు వ్యక్తులపై తుది చార్జిషీట్ దాఖలు చేశారు. రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం ఈ మేరకు అభియోగపత్రాలను సమర్పించారు. ఇదివరకే ప్రధాన చార్జిషీట్, నాలుగు అనుబంధ
సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసులో రెగ్యులర్ బెయిల్ కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ వాదించింది.