Arvind Kejriwal: పంజాబ్ పోలీసుల స్థానే గుజరాత్ పోలీసులా? ఏం జరుగుతోంది?
ABN , Publish Date - Jan 26 , 2025 | 03:50 PM
కేజ్రీవాల్ సెక్యూరిటీ నుంచి పంజాబ్ పోలీసు సిబ్బందిని ఎన్నికల కమిషన్ ఇటీవల ఉపసంహరించింది. ఈ క్రమంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం గుజరాత్ ఎస్‌ఆర్‌పీఎఫ్ బలగాలను మోహరిస్తూ ఆర్మ్‌డ్ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు గుజరాత్ నుంచి 8 రాష్ట్ర రిజర్వ్ పోలీసు బలగాలను (SRPF) మోహరించడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రశ్నించారు. కేజ్రీవాల్ సెక్యూరిటీ నుంచి పంజాబ్ పోలీసు సిబ్బందిని ఎన్నికల కమిషన్ ఇటీవల ఉపసంహరించింది. ఈ క్రమంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం గుజరాత్ ఎస్‌ఆర్‌పీఎఫ్ బలగాలను మోహరిస్తూ ఆర్మ్‌డ్ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది.
Republic Day: రెండవ రాజధానిపై సీఎం సంచలన ప్రకటన
''గుజరాత్ పోలీసుల ఆర్టర్‌ను చదవండి. ఎన్నికల సంఘం ఢిల్లీ నుంచి పంజాబ్ పోలీసులను తొలగించి గుజరాత్ పోలీసులను మోహరించింది. అసలేం జరుగుతోంది'' అని కేజ్రీవాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన సెక్యూరిటీ నుంచి పంజాబ్ పోలీసులను తొలగించడం ''పూర్తి రాజకీయం'' అంటూ ఇంతకుముందు కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కనీసం వ్యక్తిగత భద్రత విషయంలోనైనా ఎలాంటి రాజకీయాలకు తావీయరాదని అన్నారు. దీనికి పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ స్పందిస్తూ, ఢిల్లీ పోలీసులు, ఈసీ ఆదేశాల మేరకు కేజ్రీవాల్ భద్రత నుంచి పంజాబ్ పోలీసులను ఉపసంహరించినట్టు చెప్పారు.
బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం గుజరాత్ పోలీసులను మోహరించడంపై కేజ్రీవాల్ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. ఢిల్లీ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన బలగాలను మోహరించారని, ఒక్క గుజరాత్ బలగాల ప్రస్తావనే కేజ్రీవాల్ ఎందుకు చేస్తున్నారని గుజరాత్ హోం మంత్రి, బీజేపీ నేత హర్షన్ సాంఘ్వి ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్‌కు ఎన్నికల కమిషన్ నిబంధనలు తెలియవా అని నిలదీశారు. వివిధ రాష్ట్రాల నుంచి బలగాలను పంపమని ఈసీ అదేశించడం రెగ్యులర్‌గా జరిగే ప్రక్రియేనని, ఈసీ అభ్యర్థన మేరకే 8 కంపెనీల ఎస్‌ఆర్‌పీని ఢిల్లీకి పంపామని చెప్పారు. గుజరాత్ బలగాలను మాత్రమే ఎందుకు కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.
ఇవి కూడా చదవండి:
Republic Day 2025: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
Republic Day 2025: గణతంత్ర దినోత్సవం 2025 సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్..