Share News

Delhi Election: డాక్టర్ అబేండ్కర్ సమ్మాన్ స్కాలర్‌షిప్ యోజన.. ఆప్ మేనిఫెస్టో హామీ

ABN , Publish Date - Jan 27 , 2025 | 03:30 PM

విదేశాల్లో సీట్లు వచ్చినప్పటికీ అందుకయ్యే ఖర్చు భరించలేక చదువులకు దూరంగా ఉండిపోతున్న దళిత విద్యార్థులను తాము చదివిస్తామని, ఆప్ కీలక గ్యారెంటీలలో ఇది ఒకటని కేజ్రీవాల్ చెప్పారు. దళిత విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

Delhi Election: డాక్టర్ అబేండ్కర్ సమ్మాన్ స్కాలర్‌షిప్ యోజన.. ఆప్ మేనిఫెస్టో హామీ

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 15 కీలక హామీలతో కూడిన మేనిఫెస్టో (Manifesto)ను సోమవారంనాడు విడుదల చేసింది. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. సీఎం అతిషి, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ''డాక్టర్ అంబేడ్కర్ సమ్మాన్ స్కాలర్‌షిప్ యోజన'' అమలుకు ఆప్‌ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ పథకం ఢిల్లీకి చెందిన దళిత విద్యార్థులు ఉన్నత విద్య కోసం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ పొందితే వారికయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే స్పానర్స్ చేస్తుంది. గత ఏడాది డిసెంబర్‌లో కేజ్రీవాల్ ఈ పథకాన్ని ప్రకటించారు.

Mahakumbh: త్రివేణి సంగమంలో అమిత్‌షా పవిత్ర స్నానం


విదేశాల్లో సీట్లు వచ్చినప్పటికీ అందుకయ్యే ఖర్చు భరించలేక చదువులకు దూరంగా ఉండిపోతున్న దళిత విద్యార్థులను తాము చదివిస్తామని, ఆప్ కీలక గ్యారెంటీలలో ఇది ఒకటని కేజ్రీవాల్ చెప్పారు. దళిత విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. తక్కిన విధివిధానాలు, ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది ఆయన వెల్లడించలేదు.


యువతకు ఉద్యోగాల కల్పన, మహిళా సమ్మాన్ యోజన కింద నెలకు రూ.2,100 ఆర్థిక సాయం, సంజీవని పథకం కింద 60 ఏళ్లు పైబడిన వారికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స, నీటి సరఫరా బిల్లు మాఫీ, నిరంతరాయ విద్యుత్తు, యూర‌ప్ తరహాలో రోడ్ల నిర్మాణం, యమునా నదీజలాల ప్రక్షాళన, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, ఢిల్లీ మెట్రో ప్రయాణంలో 50 శాతం రాయితీ, పూజారులు, గ్రంథీలకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం, ఆటో, టాక్సీ, ఈ-రిక్షా డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.లక్ష అందజేత, వారి పిల్లలకు ఉచిత కోచింగ్, జీవిత బీమా వంటి పలు హామీలు ఇందులో ఉన్నాయి.


Sanatan Vedic Nation : సనాతన వైదిక దేశమే లక్ష్యం

India IST Now : ఇక నుంచి భారత్‌లో.. వన్ టైమ్.. వన్ నేషన్..

Saif Ali Attack Case: ఉద్యోగం, పెళ్లి రెండూ పోయాయి.. దాడి అనుమానితుడి ఆవేదన

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 27 , 2025 | 03:30 PM