Share News

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు అదనపు భద్రత ఉపసంహరించుకొన్న పోలీసులు

ABN , Publish Date - Jan 23 , 2025 | 09:06 PM

Arvind Kejriwal: పంబాజ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు అదనపు భద్రతను తొలగించాలని నిర్ణయించారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు అదనపు భద్రత ఉపసంహరించుకొన్న పోలీసులు
Delhi Ex CM Arvind Kejriwal

న్యూఢిల్లీ, జనవరి 23: పంజాబ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కేటాయించిన అదనపు భద్రతను ఉపసంహరించుకోనున్నట్లు పంజాబ్ పోలీసులు గురువారం స్పష్టం చేశారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్‌కు పంజాబ్ పోలీసులు అదనపు భద్రత కల్పించడంపై ఢిల్లీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం ఢిల్లీ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌కు కల్పిస్తున్న అదనపు భద్రతను ఉపసంహరించుకోవాలని పంజాబ్ పోలీసులు నిర్ణయించారు.

ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కారుపై ఆగంతకులు రాళ్లు విసిరారు. దీంతో బీజేపీపై ఆప్ నేతలు మండిపడ్డారు. అయితే ఆప్ నేత కారు.. ఇద్దరు తమ పార్టీ కార్యకర్తలను ఢీకొట్టిందంటూ బీజేపీ నేతలు ఎదురు దాడికి దిగారు. అయితే తనను దేవుడు రక్షిస్తాడంటూ అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. జీవనాడి కొట్టుకున్నంత కాలం తాను జీవించి ఉంటానని ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌పై ఖలిస్థాన్ మద్దతు వర్గం దాడికి కుట్ర పన్నుతోందంటూ నిఘా వర్గాలకు నివేదికలు అందించాయి. దీంతో కేజ్రీవాల్ భద్రతా ఏర్పాట్లపై సమీక్షిస్తామని అప్పట్లో ఢిల్లీ పోలీసు ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి.


ఢిల్లీ లిక్కర్ స్కాం.. మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను గతేడాది ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని తీహాడ్ జైలుకు తరలించారు. ఆ క్రమంతో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పలుమార్లు ఆయన కోర్టును ఆశ్రయించారు. గతేడాది చివర్లో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. అదీకూడా షరతులతో కూడిన బెయిల్ రావడంతో.. సీఎం కేజ్రీవాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read: తక్కువ పెట్టుబడితో.. రోజుకు రూ.10 వేలు లాభం


ఈ నేపథ్యంలో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన కేబినెట్‌లోని సీనియర్ మంత్రి అతిషిని ఆ పదవిలో కూర్చొబెట్టారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. ప్రజల మద్దతుతో సీఎం పీఠంపై అధిష్టిస్తానంటూ కేజ్రీవాల్.. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే వేళ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది.

Also Read: వాతావరణ శాఖ కీలక అలర్ట్.. రిపబ్లిక్ డే వరకు..


ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారు పొత్తు లేకుండా పోటీ చేస్తున్నాయి. అయితే న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థిగా ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బరిలో దిగగా.. బీజేపీ నుంచి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్నారు.

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Also Read: కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు

Also Read: ఐటీ దాడులు.. మహిళా అధికారితో వాదన.. దిల్ రాజు సీరియస్

For National News And Telugu News

Updated Date - Jan 23 , 2025 | 09:06 PM