Home » Arvind Kejriwal
ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు భాగస్వామ్య పక్షాలు. అయితే ఈ రెండు పార్టీలు సార్వత్రిక ఎన్నికల వేళ... పలు లోక్‌సభ స్థానాల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే దేశ రాజధాని న్యూఢిల్లీల్లో మొత్తం 7 లోక్‌సభ స్థానాల్లో నాలుగింటిలో ఆప్ పోటీ చేస్తుంటే.. 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను నిలిపింది.
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తనకు మరో వారం రోజులపాటు మధ్యంతర బెయిల్ గడువు పొడిగించాలని కేజ్రీవాల్ పెట్టుకొన్నఅత్యవసర పిటిషన్‌ను సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది. జస్టిస్ జేకే మహేశ్వరి, కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం.. కేజ్రీవాల్ పిటిషన్‌ను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది.
ఆమ్ ఆద్మీ పార్టీకి తాను రాజీనామా చేయనని, పార్టీ ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు చెందినది కాదని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ చెప్పారు. దాడి ఘటన అనంతరం బీజేపీకి చెందిన ఎవరూ తనను కలవలేదని కూడా ఆమె వివరణ ఇచ్చారు.
లోక్‌సభ ఎన్నికల(lok sabha election 2024) నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్‌ను 7 రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యంతో బాధపడుతున్నారని అందుకే పొడిగించాలని చెప్పినట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో భాగంగా దేశరాజధానిలో పోలింగ్ జరుగుతుండగా పాకిస్థాన్ మంత్రి ఫవద్ చౌదరి మరోసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. అయితే, అంతే వేగంగా కేజ్రీవాల్ స్పందించారు. ''ముందు మీ సొంతిల్లు చక్కబెట్టుకోండి'' అంటూ పాక్ మంత్రికి క్లాస్ పీకారు.
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అన్నారు. లోక్‌సభకు శనివారం జరుగుతున్న 6వ దశ పోలింగ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి కేజ్రీవాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల(Lok Sabha election 2024) ఆరో దశ(Phase 6) ఓటింగ్ జరుగుతోంది. ఈ దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో సహా.. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
ప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన కేజ్రీవాల్‌ను కలిసేందుకు వచ్చిన సమయంలో తనపై బిభవ్ కుమార్ విచక్షణరహితంగా దాడి చేశారని గుర్తుచేశారు.
ఇండియా కూటమి గెలిస్తే ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని కేజ్రీవాల్ తెలిపారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడాలన్నదే తన లక్ష్యమని అన్నారు. వాళ్లు తిరిగి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని పరోక్షంగా బీజేపీని విమర్శించారు.