Share News

Atchannaidu: ఏపీలో వారికి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.20 వేలు.. ఎప్పటి నుంచంటే

ABN , Publish Date - Feb 21 , 2025 | 07:01 PM

Atchannaidu: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ప్యాలస్‌లో ఉండే జగన్ బయటకు వచ్చి అబద్ధాలు చెబుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Atchannaidu: ఏపీలో వారికి గుడ్ న్యూస్..  ఒక్కొక్కరికి రూ.20 వేలు.. ఎప్పటి నుంచంటే
Minister Kinjarapu Atchannaidu

శ్రీకాకుళం: తప్పుడు హామీలతో 2019లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవస్థలు అన్నింటినీ నాశనం చేసి... రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టారని విమర్శించారు. ఇలాంటి నాయకుడు ఉంటే రాష్ట్రం బాగుపడదని.. ప్రజలు ఎన్డీయే ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతోందని చెప్పారు. అనుభవజ్ఞులు కాబట్టే చంద్రబాబు పాలన చేయగలుగుతున్నారని అన్నారు. ఇంకొకరు అయితే నమస్కారం పెట్టి వెళ్లిపోయేవారని అన్నారు. ప్రభుత్వం మీద పట్టు కోసం మూడు మాసాలు పట్టిందని.. అన్ని శాఖల్లో అప్పులు తప్ప ఏమి కనబడలేదని తెలిపారు. 22 మంది ఎంపీలు గెలిచారు కాబట్టే కేంద్రంలో మన పలుకుబడి పెరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే నిలదొక్కుకోగలిగామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


బకాయిలు తీరుస్తున్నాం..

కాంట్రాక్టర్లకు బకాయిలు అన్ని తీరుస్తున్నామని, అభివృద్ధిని గాడీలో పెడుతున్నామని తెలిపారు. పల్లె పండుగ, రోడ్లు, ఆర్ అండ్ బీ రోడ్లు రూ.1300 కోట్లతో గోతులు పూడుస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని, పోలవరం త్వరలోనే పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చుకుంటూ వెళ్తున్నామన్నారు. తల్లికి వందనం, మిగిలినవి త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. వేసవి సెలవుల తర్వాత అన్ని సదుపాయాలతో పాటు తల్లికి వందనం అమలు చేస్తామన్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఏప్రిల్ నెలలో మత్స్యకార భరోసా రూ. 20 వేలు ఇస్తామని ప్రకటించారు . పీఎం కిసాన్‌కి తోడు అన్నదాత సుఖీభవ కింద ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తోడ్పాటు అందిస్తామని ప్రకటించారు. 24 శాతం వ్యవసాయం నుంచే రాష్ట్రానికి ఆదాయం వస్తుందని తెలిపారు. జగన్ వ్యవసాయ రంగానికి నష్టం చేకూర్చారని ధ్వజమెత్తారు. ఇన్స్యూరెన్స్, ఇన్‌ఫుట్ సబ్సిడీ, యాంత్రీకరణ కూడా గడచిన ఐదేళ్లుగా ఏం లేదని చెప్పారు. కరువు, వరదల్లో పైసా సహాయం లేదన్నారు. రైతు పంటకు ధర కూడా లేదని అన్నారు. అష్ట కష్టాలతో రైతు అమ్మిన ధాన్యానికి ఆరేడు మాసాల తర్వాత డబ్బులు ఇచ్చేవారని తెలిపారు. రూ.1600 కోట్లను రైతులకు వైసీపీ ప్రభుత్వం బకాయి పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది మాసాల్లో 5 తుఫానులు వస్తే త్వరితగతిన రూ. 270 కోట్లు సాయం చేశామని గుర్తుచేశారు. ప్రభుత్వం చేసిన సాయం చెప్పడానికి ఇష్టం లేకపోతే సైలెంట్‌గా ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.


జగన్ అబద్ధాలు చెబుతున్నాడు

‘‘ప్యాలస్‌లో ఉండే జగన్ బయటకు వచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. కరోనాలో మినహా మిర్చికి మంచి ధర లేదు. మిర్చి విషయంలో జగన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. 2020లో జగన్ జీవో ఇచ్చాడు.. గుంటూరు మిర్చి యార్డులో రూ.13500 ధర ఉంది. మిర్చికి మద్దతు ధర పేరుతో జగన్ ఆనాడు రూ.7500 ధర ఇచ్చాడు.. దీనిపై ఇప్పటికే జగన్‌ను ప్రశ్నించా. జగన్ గగ్గోలు పెడుతుంటే నవ్వాలో ఏమి చేయాలో అర్ధం కావడం లేదు. సీజన్ రాక మునుపే మిర్చి విషయంలో తాము పర్యవేక్షణ చేస్తున్నాం. ఇప్పటికే ఐదుసార్లు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఒకప్పుడు చైనా, వియత్నాం దేశాలకు భారీగా మిర్చి ఎగుమతి అయ్యేది. మన రకాలే ఇప్పుడు అక్కడ సాగవుతుండటంతో డిమాండ్ తగ్గింది. మిర్చి రైతుల విషయంలో సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చించారు. రూ.11400 అనుకుంటున్నారు.. కానీ చాలా తక్కువ.. మద్దతు ధర ఎంత అయితే బాగుంటుందో రాష్ట్రాన్ని అడిగారు.. అది నేటి సాయంత్రం ఫైనల్ చేస్తున్నాం. పంటలకు కేంద్ర ప్రభుత్వ సాయం 25 శాతం నుంచి 75 శాతం వరకూ తోడ్పాటు పెంచింది. టమాటా ధరలు రాష్ట్రంలో బాగా తగ్గాయి.. గతంలో తగ్గితే రోడ్ల మీదనే పారబోసేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా వెళ్తున్నాం.. ఇప్పటికే సమీక్ష నిర్వహించాం.. ఉన్నది ఉన్నట్లుగా కొనుగోలు చేయాలని కొన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించా. రూ. 8, 9లకు కొనుగోలు చేసి.. రాష్ట్రంలో అన్ని రైతు బజారులకు సరఫరా చేసి.. ప్రాఫిట్ లేకుండా అమ్మకాలు చేస్తున్నాం. జగన్ రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. తాము అభివృద్ధిపైనే దృష్టి పెట్టాం...తప్పు చేసేవారిని వదిలిపెట్టం. గన్నవరంలో మా పార్టీ కార్యాలయంపై దాడి చేసి మమ్మల్నే అరెస్ట్ చేశారు’’ అని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Minister Kollu Ravindra: జగన్ డ్రామాలను ప్రజలు ఛీకొడుతున్నారు.. మంత్రి కొల్లు రవీంద్ర విసుర్లు

Viveka Case: వివేకా హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ

Vamshi Case: మళ్లీ సమయం కోరిన పోలీసులు.. వంశీ న్యాయవాదుల అభ్యంతరం

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 21 , 2025 | 07:09 PM