Home » Bengaluru News
చన్నపట్టణ ఎమ్మె ల్యేగా గెలిచిన ఉత్సాహంలో సీపీ యోగేశ్వర్ మాట్లాడుతున్నారని జేడీఎస్ ఎమ్మెల్యే శారదా పూర్యానాయక్(JDS MLA Sarada Pooryanayak) తిరగబడ్డారు. శివమొగ్గలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అతనెవరు.. మమ్మల్ని కొన్నారా... ఆయనను నమ్ముకుని మేం గెలవలేదన్నారు.
వాల్మీకి కార్పొరేషన్(Valmiki Corporation)లో అవినీతి ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా చేసిన నాగేంద్ర(Nagendra)ను మళ్లీ కేబినెట్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నాగేంద్రకు సిద్దరామయ్య కేబినెట్లో బెర్త్ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
ప్రజాకోర్టులో గెలిచామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) సంతోషం వ్యక్తం చేశారు. మూడు స్థానాల్లో మా అభ్యర్థులకు ప్రజలు ఆశీస్సులు అందించారని వారికి ధన్యవాదాలన్నారు. విజయానికి కార్యకర్తల కృషి, నాయకుల కష్టం ఉందన్నారు.
తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి సంబంధించిన 33 క్రస్ట్ గేట్లను తప్పనిసరిగా మార్చాలని బోర్డు తీర్మానించింది. క్రస్ట్ గేట్ల సామర్థ్యంపై జాతీయస్థాయి కంపెనీలతో సమగ్ర తనిఖీలు నిర్వహించి ప్రతిపాదనలను సిద్ధం చేసేందుకు బోర్డు సమావేశం నిర్ణయించింది.
శీతాకాల సమావేశాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని, సీఎం సిద్దరామయ్యకు ఉధ్వాసన తప్పదని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి(Gangavathi MLA Gali Janardhan Reddy) అభిప్రాయపడ్డారు.
అత్యంత చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న 14 నెలల పసిపాపకు గుండెమార్పిడి శస్త్రచికిత్సలను నారాయణ ఆసుపత్రి(Narayana Hospital) వైద్యులు విజయవంతం చేశారు. అత్యంత తక్కువ వయస్సు కల్గిన పాపకు ఆపరేషన్ ద్వారా ప్రాణం పోశారు.
బీపీఎల్ కార్డుల రద్దు ద్వారా సామాన్యులు, పేద వర్గాల కడుపుకొట్టేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కుంటి సాకులు చెబుతూ గ్యారెంటీల్లో ఒక్కొక్క దానికి తొలగించే కుట్ర అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) మండిపడ్డారు.
బీపీఎల్(బిలో పావర్టీ లైన్) రేషన్ కార్డుల(Ration cards) ఏరివేతలో భాగంగా బళ్లారి, విజయనగర జిల్లాల్లో అనర్హులుగా గుర్తించి 14,082 మంది కార్డులు రద్దు చేశారు. బళ్లారి జిల్లాలో మొత్తం 12,950 మంది అనర్హులు బీపీఎల్ కార్డులు పొందినట్లు గుర్తించి, రద్దు చేసినట్లు ఆహార పౌరసరఫరా అధికారులు తెలిపారు.
‘కాంగ్రెస్లో 135మంది ఎమ్మెల్యేలు ఉన్నామని, స్పష్టమైన మెజారిటీ ఉందని, నాకు రూ.100 కోట్లు కాదు రూ.వెయ్యి కోట్లు ఇచ్చినా బీజేపీలో చేరేది లేదు’ అని బెళగావి ఉత్తర కాంగ్రెస్ ఎమ్మెల్యే అసిఫ్ సేఠ్(Belagavi North Congress MLA Asif Seth) తెలిపారు.
ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జీవనాడి అయిన తుంగభద్ర(Tungabhadra) జలాశయంలో నీరు రోజురోజుకు రంగుమారుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్లో అల్పపీడనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ఈ కలుషిత నీటి వల్ల రబీ పంటలో కూడా దెబ్బతింటాయేమోనని ఆందోళన చెందుతున్నారు.