Home » bomb blasts
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో నిందితుడ్ని అరెస్ట్ చేసింది.
బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనుమానితుడిని కర్ణాటక ( Karnataka ) లోని బళ్లారి జిల్లాకు చెందిన షబ్బీర్‌గా గుర్తించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని (Bengaluru) రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు (Rameshwaram Cafe Bomb Blast) కేసు వ్యవహారంలో కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర (G Parameshwara) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుళ్ల వెనుక వ్యాపార శత్రుత్వం కారణమై ఉంటుందా? త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న ప్రయత్నంలో ఈ పేలుళ్లు ఒక భాగమా?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని (Bengaluru) రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు (Rameshwaram Cafe Bomb Blast) ఘటన నుంచి తనను ఒక ఫోన్ కాల్ కాపాడిందని కుమార్ అలంకృత్ (Kumar Alankrit) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ తెలిపాడు. ఆ ఫోన్ కాల్ తనకు తల్లి నుంచి వచ్చిందని.. పేలుడు సంభవించడానికి కొన్ని సెకన్ల ముందే తాను ఆ కాల్‌ను స్వీకరించడానికి బయటకు వచ్చానని అతను పేర్కొన్నాడు.
బెంగళూరులోని (Bengaluru) రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్లపై (Rameshwaram Cafe Bomb Blast) బీజేపీ (BJP) చేసిన విమర్శలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) తిప్పికొట్టారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే బీజేపీ ఈ ఘటనపై రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో కూడా బాంబు పేలుళ్లు (Bomb Blasts) జరిగాయని, అప్పుడు వాళ్లు కూడా బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారా? అని సీఎం ప్రశ్నించారు.
కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. కేఫ్‌లో దాడికి ఐఈడీ ఉపయోగించినట్టు చెప్పారు. కేఫ్‌లోకి వచ్చిన ఓ వ్యక్తి బ్యాగు పెట్టి వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిందన్నారు.
టెక్నాలజీ హబ్ బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన ఘటనకు బాంబు పేలుడే కారణమని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అన్నారు. కేఫ్ ఆవరణలో ఒక కస్టమర్ వదిలివెళ్లిన బ్యాగ్‌లోని పేలుడు పదార్ధమే ఇందుకు కారణమని, సిలెండర్ పేలుడు కాదని రామేశ్వరం కేఫ్ వ్యవస్థపాకుడు నాగరాజ్ తనకు తెలిపినట్టు చెప్పారు.
బెంగళూరులో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారి జరిగిన ఘటనతో నగరం ఉలిక్కిపడింది. రాజాజీనగర్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో మధ్యాహ్న భోజనం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కర్ణాటక బెంగళూరు(bangalore)లోని కేంద్రీయ విద్యాలయం IISCకి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ శుభ ఘడియలు ముంచుకొస్తున్న తరుణంలో.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు బాంబు బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.