Rameshwaram Case: రామేశ్వరం కేఫ్ పేలుడు నుంచి టెక్కీని కాపాడిన ‘ఫోన్ కాల్’.. ఎలాగంటే?
ABN , Publish Date - Mar 02 , 2024 | 05:42 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని (Bengaluru) రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు (Rameshwaram Cafe Bomb Blast) ఘటన నుంచి తనను ఒక ఫోన్ కాల్ కాపాడిందని కుమార్ అలంకృత్ (Kumar Alankrit) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తెలిపాడు. ఆ ఫోన్ కాల్ తనకు తల్లి నుంచి వచ్చిందని.. పేలుడు సంభవించడానికి కొన్ని సెకన్ల ముందే తాను ఆ కాల్‌ను స్వీకరించడానికి బయటకు వచ్చానని అతను పేర్కొన్నాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని (Bengaluru) రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు (Rameshwaram Cafe Bomb Blast) ఘటన నుంచి తనను ఒక ఫోన్ కాల్ కాపాడిందని కుమార్ అలంకృత్ (Kumar Alankrit) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తెలిపాడు. ఆ ఫోన్ కాల్ తనకు తల్లి నుంచి వచ్చిందని.. పేలుడు సంభవించడానికి కొన్ని సెకన్ల ముందే తాను ఆ కాల్‌ను స్వీకరించడానికి బయటకు వచ్చానని అతను పేర్కొన్నాడు. ఈ పరిణామంతో తల్లి ఒక దేవత అనే విషయం నిరూపితమైందని ఆ టెక్కీ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఈ ఘటనపై శనివారం (02/03/24) అలంకృత్ మాట్లాడుతూ.. ‘‘మా ఆఫీస్ నుంచి రామేశ్వరం కేఫ్ చాలా దగ్గరలోనే ఉంటుంది. నేను అక్కడ భోజనం చేయడానికి వెళ్లాను. ఇడ్లీ & దోస ఆర్డర్ చేశాను. నా ఆర్డర్ రాగానే.. కూర్చోవడానికి ఒక టేబుల్ వద్దకు వెళ్తుండగా.. నాకు అమ్మ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో.. అమ్మతో మాట్లాడేందుకు నేను కేఫ్ నుంచి బయటకొచ్చాను. ఇంతలోనే రెస్టారెంట్ నుంచి పేలుడు శబ్దం వినిపించింది. ఈ ఘటన జరిగినప్పుడు నేను ఆ కేఫ్ నుంచి 10-15 మీటర్ల దూరంలో ఉన్నాను’’ అని చెప్పుకొచ్చాడు. తొలుత తాను గ్యాస్ సిలిండర్ పేలిందేమోనని భావించానని అన్నాడు. అనంతరం బాంబు పేలుడు అని తెలిసి షాక్‌కు గురయ్యానని, తల్లి నుంచి ఫోన్ కాల్ రావడం వల్లే తాను ఆ సంఘటన నుంచి తప్పించుకోగలిగానని పేర్కొన్నాడు.
ఇదిలావుండగా.. శుక్రవారం ఈ పేలుడు సంభవించడానికి కొన్ని నిమిషాల ముందు రామేశ్వరం కేఫ్ ప్రాంగణంలో ఒక వ్యక్తి బ్యాగ్‌తో వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో (CCTV Footage) రికార్డ్ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఈ బ్యాగ్‌ను కేఫ్‌లో ఉంచి, టైమర్ ఆన్ చేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనుమానితుడితో పాటు కనిపించిన మరో వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన నిందితుడు మాత్రం.. తన ముఖానికి ముసుగు, గ్లాసెస్.. తలకు క్యాప్ పెట్టుకొని కెమెరాలకు చిక్కాడు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు.. ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి