Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Rameshwaram Cafe Blast: కేసులో కొత్త ట్విస్ట్.. ఆ కారణాలే అయ్యుండొచ్చన్న హోంమంత్రి

ABN , Publish Date - Mar 03 , 2024 | 06:25 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని (Bengaluru) రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు (Rameshwaram Cafe Bomb Blast) కేసు వ్యవహారంలో కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర (G Parameshwara) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుళ్ల వెనుక వ్యాపార శత్రుత్వం కారణమై ఉంటుందా? త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న ప్రయత్నంలో ఈ పేలుళ్లు ఒక భాగమా?

Rameshwaram Cafe Blast: కేసులో కొత్త ట్విస్ట్.. ఆ కారణాలే అయ్యుండొచ్చన్న హోంమంత్రి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని (Bengaluru) రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు (Rameshwaram Cafe Bomb Blast) కేసు వ్యవహారంలో కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర (G Parameshwara) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుళ్ల వెనుక వ్యాపార శత్రుత్వం కారణమై ఉంటుందా? త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న ప్రయత్నంలో ఈ పేలుళ్లు ఒక భాగమా? లేకపోతే బెంగళూరుకి వస్తున్న పెట్టుబడుదారుల్ని (Investors) భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారా? అనే కోణాల్లో కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. ఈ కేసుని ఛేధించేందుకు ఎనిమిది పోలీసు బృందాలు పని చేస్తున్నాయని.. వీరికి జాతీయ దర్యాప్తు సంస్థ, నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ (NSG), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) సహాయం చేస్తున్నాయని అన్నారు.


‘‘సార్వత్రిక ఎన్నికలు (2024 Elections) సమీపిస్తున్న తరుణంలో ఈ బాంబు పేలుడు ఘటన చోటు చేసుకోవడంతో.. పోలీసులు కొన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ పేలుడు వెనుక ఏదైనా ఉగ్రవాద సంస్థ ఉందా? లేకపోతే బెంగళూరు సురక్షితమైన ప్రాంతం కాదని ప్రజల్లో భయం పుట్టించేందుకు ఇలా చేశారా? అనే కోణాల్లో అధికారులు ఫోకస్ పెట్టారు. కర్ణాటకలో ఉన్న స్థిరమైన ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెట్టుబడిదారులు బెంగళూరుకి తరలివస్తున్నారు. బహుశా వాళ్లు బెంగళూరుకి రాకుండా అడ్డుకోవాలన్న ఉద్దేశం లేదా ఇతర కారణాలు కూడా ఈ పేలుడు వెనుక ఉండొచ్చు’’ అని హోంమంత్రి పరమేశ్వర చెప్పుకొచ్చారు. అంతేకాదు.. వ్యాపార ప్రత్యర్థులు అసూయతో ఇలా చేసి ఉండవచ్చన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తపరిచారు. రామేశ్వరం కేఫ్‌ మొత్తం 11 బ్రాంచ్‌లను కలిగి ఉందని, దాని యజమానులు 12వ బ్రాంచ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారని అన్నారు.

తాము ఈ కేసుని వీలైనంత త్వరగా ఛేధిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని మంత్రి పరమేశ్వర నొక్కి చెప్పారు. ఈలోపు ఊహాజనిత వార్తల్ని ప్రజలు నమ్మొద్దని.. పోలీసులు & సీఎం సిద్ధరామయ్య ఇచ్చే స్టేట్‌మెంట్‌లను మాత్రమే నమ్మాలని పేర్కొన్నారు. 2022లో మంగళూరులో జరిగిన ప్రెషర్ కుక్కర్ పేలుడు తరహాలో ఈ ఘటనలో సామాగ్రిని సేకరించారని.. అయితే ఈ రెండు ఘటనలకి సంబంధం ఉందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ఈ ఘటనలో ఉపయోగించిన పేలుడు పదార్థాలు తక్కువ తీవ్రత, పరిమాణం కలిగి ఉన్నాయన్నారు. ఒకవేళ పరిమాణం పెద్దగా ఉండుంటే ప్రమాదం పెద్దగా సంభవించి ఉండేదని, అప్పుడు మరణాలు కూడా చోటు చేసుకునేవని పరమేశ్వర వివరించారు. అదృష్టవశాత్తూ అలా జరగలేదని అన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 06:25 PM