Home » Chandra Babu
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ని టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, చెన్నుపాటి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. రాజకీయాల్లో పదవులు వస్తాయి.. పోతాయి.. కానీ కమిట్మెంట్ చాలా ముఖ్యమని.. అటువంటి కమిట్మెంట్ ఉన్న నేత కేశినేని శివనాథ్ అని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల వాస్తవాలు బహిర్గతం అయ్యాయని బీజేపీ ప్రత్యేక అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్ట్ 2019కి ముందు మొత్తం 72% పూర్తైందని తెలిపారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు 14,418.39 కోట్ల రూపాయలు అని పేర్కొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి. శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు.
వైకుంఠం ఎదురుగా వున్న ఈడీపీ ఆఫీస్‌లో మంటలు చెలరేగాయి. ఏసీ కంప్రెజర్ నుంచి మంటలు చెలరేగడంతో ఫైర్ అలారం మోగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. గత కొద్ది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే మంటలు చెలరేగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఆంధ్రా యూనివర్సిటీ ప్రమాణాలను, ప్రతిష్టను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిగజార్చారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ట్విటర్ వేదికగా విమర్శించారు. వైస్ ఛాన్సలర్‌గా కరుడుగట్టిన వైసీపీవాది ప్రసాదరెడ్డిని నియమించి ఈ గడిచిన ఐదేళ్లలో యూనివర్సిటీ ప్రతిష్టను అమాంతం దిగజార్చారని విమర్శించారు. గాంధీ విగ్రహం పక్కనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టించి యూనివర్సిటీని ఒక రాజకీయపార్టీ కార్యాలయంగా మార్చేశారని ఫైర్ అయ్యారు.
ఏడు ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నేడు పోలవరంపై తొలి వైట్ పేపర్ ను విడుదల చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోలవరం విధ్వంసంపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.
డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదలకు చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ యోచనలో ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం తప్పిదం కారణంగా రెండు రకాలుగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మూడేళ్ల నుంచి గత ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహించలేదు. ఇప్పటి వరకూ టెట్ రాయని వారికి టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా మండవ రమ్యకృష్ణ ఉన్నారు. ఆమె షిర్డీ నుంచి గన్నవరం వస్తున్న రమ్యకృష్ణ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. రమ్యకృష్ణ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. రమ్యకృష్ణ మృతి బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు.
నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఉదయం 10 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లోని కేబినెట్ హాల్లో మంత్రిమండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చేసిన ఐదు సంతకాలకు నేడు కేబినెట్లో ఆమోదం తెలపనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంపై తమిళ మీడియా ప్రశంసల్లో ముంచెత్తింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ చాణక్యాన్ని, రాజకీయ విశేషాలను పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం సాయంత్రం వరకు టీవీ చానళ్లు కథనాలను ప్రసారం చేశాయి. ప్రచార సమయంలో ఓ వేదికపై ప్రధాని మోదీ చంద్రబాబు చేతులు పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్న దృశ్యాలను ప్రత్యేకంగా ప్రసారం చేశాయి.