Home » Chennai News
ఒకే సమయంలో 555 వర్మ చికిత్స నిపుణుల ద్వారా 555 మందికి చికిత్స చేసి జాతీయ సిద్ధ వైద్య సంస్థ (ఆసుపత్రి) ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ సిద్ధ వైద్య సంస్థ నిర్వాహకులు దేశవ్యాప్తంగా సిద్ధ వైద్యానికి ప్రాచుర్యం కల్పించేలా గత యేడాది ఢిల్లీ నుంచి కన్నియాకుమారి(Kanyakumari) వరకు ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు.
అన్ని మతాలూ ఆత్మీయ భావాలనే బోధిస్తున్నాయని, తానొక క్రైస్తవుడినని చెప్పుకునేందుకు ఎంతగానో గర్వపడుతున్నానని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) వ్యాఖ్యానించారు.
మేట్టుపాళయం-ఊటీ(Mettupalayam-Ooty) మధ్య కొండ రైలు సేవలు ఐదు రోజుల అనంతరం మళ్లీ ప్రారంభమయ్యాయి. కోయంబత్తూర్(Coimbatore) జిల్లా మేట్టుపాళయం నుంచి నీలగిరి జిల్లా ఊటీ మధ్య కొండ రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి.
అత్యవసర వైద్యం అవసరమైన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం ‘108 అంబులెన్స్’(108 Ambulance) సేవలు పరిచయం చేసింది. ప్రస్తుతం రాజధాని నగరం చెన్నైలో 8 నిమిషాలు, ఇతర జిల్లాల్లో 13 నిమిషాల్లో 108 సేవలు పొందే వసతి ఉంది. ఈ సమయాన్ని మరింత తగ్గించేలా అంబులెన్స్ ఉండే ప్రాంతాన్ని తెలుసుకొనేలా ప్రత్యేక లింక్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్రరూపం దాల్చింది. ఇది రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా పయనించి దక్షిణ తమిళనాడు-దక్షిణ ఆంధ్రప్రదేశ్(Tamil Nadu-South Andhra Pradesh)లోని కోస్తా ప్రాంతాల మీదుగా పయనించనుంది.
ప్రభుత్వ కళాశాల రోడ్డులో చిరుతపులి(Leopard) సంచరించే సీసీ టీవీ దృశ్యాలు విద్యార్థులు, తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వాల్పారై, చుట్టుపక్కల గ్రామాల్లో కొద్దిరోజులుగా వన్యమృగాల సంచారం అధికమవుతోంది.
స్థానిక మూర్ మార్కెట్ కాంప్లెక్స్ నుంచి బయల్దేరే మెమొ రైళ్లలో మార్పులు చేసినట్టు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - మూర్ మార్కెట్ కాంప్లెక్స్-సూళ్లూరుపేట(Moore Market Complex-Sullurpet) మెమొ తెల్లవారుజామున 5.15 గంటలకు బదులు 5.40 గంటలకు బయల్దేరుతుంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని, దీని ప్రభావంతో ఈ నెల 20వతేదీ వరకు చెన్నై సహా 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఏ ఒక్క ఆలయంలో కూడా గర్భాలయంలోకి ఎవరికీ ప్రవేశం లేదని సినీ నటి కస్తూరి(Film actress Kasturi) అభిప్రాయపడ్డారు. శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాల్ ఆలయంలో సంగీత దర్శకుడు ఇళయరాజా(Music director Ilayaraja)కు అవమానం జరిగిందంటూ జరిగిన ప్రచారంపై ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు.
గూగుల్ మ్యాప్(Google Map) చూపిన మార్గంలో ఓ డాక్టర్ దంపతులు కారులో వెళ్లి చేతిబిడ్డతో పాటు బురదలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ధర్మపురి(Dharmapuri) జిల్లా నల్లంపల్లికి చెందిన పళనిస్వామి (27), కృత్తిక (27) అదే ఇద్దరు డాక్టర్లు నాలుగు నెలల చంటిబిడ్డ, కృత్తిక బంధువు పావేందర్ (25) అనే డాక్టర్ కలిసి కారులో పళని మురుగన్ ఆలయానికి బయలుదేరారు.